India vs Australia: రాజ్‌కోట్‌లో రఫ్పాడించిన టీమిండియా.. ఆసీస్‌కు భారీ టార్గెట్

ఓపెనర్ శిఖర్ ధావన్ 96 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. లోకేష్ రాహుల్ 80, కెప్టెన్ కొహ్లీ 78 పరుగులతో రఫ్పాడించారు.


Updated: January 17, 2020, 5:53 PM IST
India vs Australia: రాజ్‌కోట్‌లో రఫ్పాడించిన టీమిండియా.. ఆసీస్‌కు భారీ టార్గెట్
ఓపెనర్ శిఖర్ ధావన్ 96 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. లోకేష్ రాహుల్ 80, కెప్టెన్ కొహ్లీ 78 పరుగులతో రఫ్పాడించారు.
  • Share this:
India vs Australia: రాజ్‌కోట్‌లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. అందరు సమిష్టిగా రాణించి ఆస్ట్రేలియాకు భారీ టార్గెట్ విధించారు. 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన కొహ్లీ సేన 340 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 96 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. లోకేష్ రాహుల్ 80, కెప్టెన్ కొహ్లీ 78 పరుగులతో రఫ్పాడించారు. రోహిత్ శర్మ 46 రన్స్‌తో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ (7), మనీష్ పాండే (2) మాత్రం విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ జడేజా 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా 3, కేన్ రిచర్డ్‌సన్ 2 వికెట్లు పడగొట్టారు.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు