India vs Australia: రాజ్‌కోట్ వన్డేలో టీమిండియా ఘన విజయం

నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌ ఈ నెల 19న (ఆదివారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది.


Updated: January 17, 2020, 9:42 PM IST
India vs Australia: రాజ్‌కోట్ వన్డేలో టీమిండియా ఘన విజయం
టీమిండియా విక్టరీ
  • Share this:
India vs Australia: రాజ్‌కోట్ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో ఆసీస్ జట్టుపై గెలిచి.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.  ఈ మ్యాచ్‌లో 341 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీమ్.. 49.1 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌటయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌‌మెన్‌లో  స్టీవెన్ స్మిత్ 98, మార్నస్ లబూషెన్ 46 పరుగులతో సత్తా చాటారు. కెప్టెన్ అరోన్ ఫించ్ 33, అగర్ 25 పరుగులతో రాణించారు.  ఓ వైపు  భారీ లక్ష్యం ఉండడం.. మరోవైపు వరుసగా వికెట్లు పడుతుండడంతో.. ఆసీస్ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత బౌలర్లలో షమి 3 వికెట్లు తీయగా.. నవ్దీప్ సైని, జడేజా, కుల్దీప్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇక బుమ్రాకు ఒక వికెట్ దక్కింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన కొహ్లీ సేన 340 పరుగులు చేసింది. బ్యాట్స్‌మెన్ అందరు సమిష్టిగా రాణించి ఆస్ట్రేలియాకు భారీ టార్గెట్ విధించారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 96 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. లోకేష్ రాహుల్ 80, కెప్టెన్ కొహ్లీ 78 పరుగులతో రఫ్పాడించారు. రోహిత్ శర్మ 46 రన్స్‌తో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ (7), మనీష్ పాండే (2) మాత్రం విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ జడేజా 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా 3, కేన్ రిచర్డ్‌సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌ ఈ నెల 19న (ఆదివారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు