Home /News /sports /

INDIA VS AUSTRALIA LIVE CRICKET SCORE BOXING DAY TEST MATCH MELBOURNE INDIA ENDS DAY1 36 FOR ONE WICKET SRD

Ind Vs Aus: బాక్సింగ్ డే టెస్ట్ లో ముగిసిన తొలిరోజు ఆట..ఆకట్టుకున్న శుభ్ మన్ గిల్

Boxing Day Test (Photo : Twitter)

Boxing Day Test (Photo : Twitter)

Ind Vs Aus: ఆస్ట్రేలియా-భారత్ ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే రెండో టెస్టు మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ దే పై చేయి. యంగ్ గన్ శుభ్ మన్ గిల్ తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి భారత్ 36 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...
    ఆస్ట్రేలియా-భారత్ ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే రెండో టెస్టు మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ దే పై చేయిగా కన్పిస్తోంది. యంగ్ గన్ శుభ్ మన్ గిల్ తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి భారత్ 36 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్ తో మరోసారి నిరాశపర్చాడు. అంతకు ముందు భారత బౌలర్లు విజృంభించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపారు. ‘బాక్సింగ్‌ డే’ రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్లు రెచ్చిపోవడంతో ఆసీస్ 195 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియా స్కోరు 200 పరుగులు దాటలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాకిచ్చాడు భారత స్పీడ్ స్టార్ బుమ్రా. అతని బౌలింగ్లో ఓపెనర్ జో బర్న్స్ డకౌట్ అయ్యాడు. దీంతో ఆసీస్ జట్టు 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనన్ మథ్యూ వేడ్‌ 30 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్.. బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. అశ్విన్ బౌలింగ్‌లో పరుగులేమి చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

    ఆ తర్వాత లబుషేన్‌, ట్రావిస్ హెడ్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 86 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. దీంతో ఆస్ట్రేలియా కోలుకున్నట్లే కన్పించింది. అయితే కుదురుకున్న వీరి భాగస్వామ్యాన్ని మరో సారి దెబ్బ తీశాడు బుమ్రా. అతని బౌలింగ్ లో 38 పరుగులు చేసిన హెడ్, రహానేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వెంట వెంటనే భారత బౌలర్లు దెబ్బ తీయడంతో 164 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. ఆఖర్లో లయన్ 17 బంతుల్లో 20 పరుగులు చేశాడు. లయన్ వికెట్ ను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి వికెట్ గా కమిన్స్ జడేజా బౌలింగ్ లో వెనుదిరిగాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు, అశ్విన్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు.


    ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే మయాంక్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్లు కన్పించింది. అయితే యంగ్ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ తనదైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లు వేసిన చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్టైలిష్ బ్యాటింగ్ తో సూపర్ అన్పించాడు. మరో ఎండ్ లో టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా ఇంకో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

    ఇక, బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆసీస్ 1-0తో టెస్ట్ సిరీస్‌లో అధిక్యంలో ఉంది. టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోతుంది. మరోవైపు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ 100వ టెస్ట్‌ మ్యాచ్‌ కావడం విశేషం. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో, భారత్‌ 28 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 27 టెస్టులు డ్రా కాగా.. ఒక టెస్టు టై గా ముగిసింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cheteswar Pujara, IND vs AUS, India vs Australia 2020, Jasprit Bumrah

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు