India vs Australia: రోహిత్ రికార్డు సెంచరీ... అయినా భారత్‌కు తప్పని ఓటమి

ఒంటరి పోరాటం చేస్తున్న రోహిత్ శర్మ... హాఫ్ సెంచరీ చేసి ధోనీ అవుట్... 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 12, 2019, 4:09 PM IST
India vs Australia: రోహిత్ రికార్డు సెంచరీ... అయినా భారత్‌కు తప్పని ఓటమి
రోహిత్ శర్మ
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 12, 2019, 4:09 PM IST
సిడ్నీ వన్డేలో ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగినా భారత్‌కు ఓటమి తప్పలేదు. రోహిత్ ఒంటరి పోరాటం చేసినా...ధోనీ మినహా మిగతా బ్యాట్స్‌మన్ విఫలమవ్వడంతో టీమిండియా తేలిపోయింది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 255 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ దశలో 4 పరుగులకే మూడు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఓపెనర్ రోహిత్ శర్మ, ధోనీ ఆదుకున్నారు. సెంచరీ భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. విరాట్ కొహ్లీ విఫలమవ్వడంతో పాటు రాయుడు, ధావన్ డకౌటవ్వడంతో చేజింగ్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం విఫలమయ్యాడు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్టోయినిస్‌కు సునాయాస క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే అంబటి రాయుడు సైతం డకౌటయ్యాడు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటై..పెవిలియన్ చేరాడు. దాంతో 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ, ఓపెనర్ రోహిత్‌తో కలిసి ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. రోహిత్‌ తనదైన శైలిలోనే దూకుడుగా ఆడగా...ధోనీ డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. 82 బంతుల్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 17 ఓవర్లలో భారత్ 50 పరుగుల మార్క్ దాటగలిగింది. రోహిత్ వన్డేల్లో 38వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 62 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ దాటాడు. ధోనీతో కలిసి 136 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం జోడించి భారత్‌ను పోటీలో నిలిపాడు రోహిత్. 93 బంతుల్లో 68వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ధోనీ ఔటయ్యాడు. ధోనీ-రోహిత్ నాలుగో వికెట్‌కు 171 బంతుల్లో 137 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ 21 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్డేల్లో రోహిత్ 22వ సెంచరీ నమోదు చేశాడు. 129 బంతుల్లో 10 ఫోర్లు,6 సిక్సర్లు 133 పరుగులు చేసిన రోహిత్ వెనుదిరగడంతో ఆస్ట్రేలియా జట్టు విజయం ఖాయమైంది.



First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...