India vs Australia: ఆస్ట్రేలియా సిరీస్‌కు రోహిత్ శర్మకు విశ్రాంతి?

India vs Australia ODI & T-20 Series | ప్రపంచకప్‌కు ముందుగా జరిగే చివరి ఏడు అంతర్జాతీయ మ్యాచ్‌లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్న భారత జట్టు అందరిలోనూ ఆసక్తిరేపుతోంది. ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నెల 15న ముంబైలో సమావేశంకానుంది.

news18-telugu
Updated: February 12, 2019, 5:00 PM IST
India vs Australia: ఆస్ట్రేలియా సిరీస్‌కు రోహిత్ శర్మకు విశ్రాంతి?
చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్
news18-telugu
Updated: February 12, 2019, 5:00 PM IST
క్రికెట్‌ ప్రపంచ కప్‌-2019కు ఇంకా ఎంతో సమయం లేదు. ప్రపంచ కప్‌కు ముందు కేవలం ఏడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే భారత జట్టు ఆడనుంది.  భారత పర్యటనకు రానున్న ఆసీస్‌తో  కోహ్లీసేన ఐదు వన్డే మ్యాచ్‌లు, రెండు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. లండన్‌లో మే 30 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచకప్ పోటీలకు ముందు భారత జట్టు ఆడనున్న చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఇవే. ఆస్ట్రేలియా సిరీస్‌ తర్వాత మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ టోర్నీతో భారత ఆటగాళ్లు ప్రపంచ కప్‌కు సన్నద్ధమవుతారు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసేందుకు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో ఈ నెల 15న(శుక్రవారం) సమావేశంకానుంది. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు జట్టులోని సీరియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఆడిన రోహిత్ శర్మ...కోహ్లీకి విశ్రాంతి కల్పించడంతో న్యూజిలాండ్‌తో నాలుగు, ఐదో వన్డేలకు, టీ20 సిరీస్‌కు సారథ్యంవహించాడు.

India vs Australia, australia tour in india, ind vs aus odi series, ind vs aus t20 series, bcci selection team, india team for australia series, భారత్-ఆస్ట్రేలియా, భారత్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్, రోహిత్ శర్మ, ఎమ్మెస్కే ప్రసాద్
రోహిత్ శర్మ


ఆస్ట్రేలియా సిరీస్‌కు విరాట్ కోహ్లీ తిరిగి జట్టుకు అందుబాటులోకి రానున్నారు. గతకొంతకాలంగా రోహిత్ శర్మ విశ్రాంతి లేకుండా మ్యాచ్‌లు ఆడుతుండడంతో...ప్రపంచ కప్‌కు సన్నద్ధం చేసేందుకు సెలక్టర్ ఈ సిరీస్ నుంచి రోహిత్‌కు విశ్రాంతి కల్పించవచ్చని తెలుస్తోంది. మరికొందరు సీనియర్ ఆటగాళ్లకు కూడా అవసరమైన విశ్రాంతి కల్పించాలన్న సెలక్టర్లు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ వన్డే, టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు టీమిండియాపై పైచేయి సాధించకుండా కట్టడి చేసేలా జట్టు కూర్పు ఉండాలని సెలక్టర్లు భావిస్తున్నారు.



India vs Australia, australia tour in india, ind vs aus odi series, ind vs aus t20 series, bcci selection team, india team for australia series, భారత్-ఆస్ట్రేలియా, భారత్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్, రోహిత్ శర్మ, ఎమ్మెస్కే ప్రసాద్
టీమిండియా


అటు బుమ్రా కూడా ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది. ప్రపంచ కప్ ఆడే జట్టులో ఒక స్థానం కోసం ఇటీవల మెరుపులు మెరిపించిన రిషభ్ పంత్, వియ్ శంకర్‌లతో పాటు దాదాపు ఏడాదిగా వన్డే, టీ20 జట్లకు దూరంగా ఉన్న రహానె మధ్య గట్టి పోటీ ఉంది. వీరిలో ఎవరికి జట్టులో చోటు కల్పించాలన్న విషయంలో ఆస్ట్రేలియా సిరీస్ ద్వారా ఓ నిర్ణయానికి రావాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్ జట్టులో కుదురుకోవడంతో పంత్‌ను స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా సెలక్షన్ కమిటీ పరిశీలిస్తోంది.
Loading....
India vs Australia, australia tour in india, ind vs aus odi series, ind vs aus t20 series, bcci selection team, india team for australia series, భారత్-ఆస్ట్రేలియా, భారత్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్, రోహిత్ శర్మ, ఎమ్మెస్కే ప్రసాద్
రిషభ్ పంత్ ( ICC / twitter )


అటు గత కొంతకాలంగా పేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న కేఎల్ రాహుల్‌ తన ఆటను నిరూపించుకునేందుకు ఆస్ట్రేలియా సిరీస్‌తో సెలక్షన్ కమిటీ మరో అవకాశం కల్పించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు