HOME »NEWS »SPORTS »india vs australia india sweat on fitness of key players for bangalore decider nk

IND vs AUS : నేడు భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డే... కిక్కంటే ఇవాళ్టి మ్యాచ్‌దే

IND vs AUS : నేడు భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డే... కిక్కంటే ఇవాళ్టి మ్యాచ్‌దే
నేడు భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డే... కిక్కంటే ఇవాళ్టి మ్యాచ్‌దే

India vs Australia 3rd ODI | ఫస్ట్ మ్యాచ్‌లో కంగారూలు, రెండో మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపాయి. ఫలితంగా సిరీస్ సమం అయ్యింది. మరి మూడో వన్డేలో గెలిచేదెవరు... సిరీస్ కొట్టేదెవరు... మధ్యాహ్నం 1.30కి మొదలయ్యే ఆటతో తేలిపోతుంది.

  • Share this:
    India vs Australia 3rd ODI : ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చాలు... టీమిండియా ఎందుకో ఒకింత కలవరపడుతోంది. ఇతర జట్లతో ఈజీగా సిరీస్‌లు గెలిచేస్తూ... కంగారూల దగ్గరకు వచ్చేసరికి... చివరి మ్యాచ్ వరకూ సిరీస్ ఫలితం తేలనివ్వకుండా చేసుకుంటోంది. గతేడాది కూడా ఇలాగే సిరీస్ విజేత ఎవరో చివరి మ్యాచ్‌లోనే తేలింది. ఇప్పుడూ అంతే. ఐతే... ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను కంగారూలు రూల్ చేస్తే... రెండో మ్యాచ్‌లో టీమిండియా ఇరగదీసింది. ఇప్పుడీ మూడో వన్డేలో రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. కొద్దిగా టీమిండియా అనుకూల పరిస్థితులు ఉన్నా... ఆసీస్ కూడా సమరానికి సై అంటోంది. ఐతే... 2012 నుంచి టీమిండియా... మూడు వన్డేల సిరీస్‌లను గెలుస్తూ... ట్రాక్ రికార్డ్ కొనసాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో... ఇవాళ బెంగళూరులోని... చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌పైనే అందరి దృష్టీ ఉంది. ఆల్రెడీ సంక్రాంతి సందడి, కోడి పందేలు, సినిమాల జోష్ అయిపోవడంతో... ఇక అందరూ... మ్యాచ్ సంగతేంటా అని చూస్తున్నారు. గతేడాది భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో 3-2తో సిరీస్‌ ఓడింది. ఇప్పుడు మాత్రం విజయంపై ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉంది. బౌలర్లు కూడా కాస్త ఫామ్‌లోకి రావడం కోహ్లీ అండ్ కోకి కలిసొచ్చే అంశం. ఫ్యాన్స్‌కి ప్లస్ పాయింట్ ఏంటంటే... చిన్నస్వామి స్టేడియం పరుగులకు కేరాఫ్ అడ్రెస్. అందువల్ల ఫుల్ ఎంజాయ్‌మెంట్ గ్యారెంటీ. దానికి తోడు వాతావరణం కూడా అదిరిపోయింది. మేఘాలు మాత్రమే ఉంటాయి. నో రెయిన్.

    భారత్‌ జట్టు అంచనా : కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌, రాహుల్‌, శ్రేయాస్‌, జడేజా, కుల్దీ్‌ప్/చాహల్‌, మనీశ్‌ పాండే, సైనీ, బుమ్రా, షమి.



    ఆస్ట్రేలియా జట్టు అంచనా : ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, స్మిత్‌, టర్నర్‌, కేరీ, లబుషేన్‌, ఏగర్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌/హాజెల్‌వుడ్‌, జంపా, కమిన్స్‌.
    Published by:Krishna Kumar N
    First published:January 19, 2020, 07:04 IST