Womens T20 World Cup: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు చేతులెత్తేసింది. మెల్బోర్న్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా టార్గెట్ ఛేదనలో తడబడింది. ఆశించిన రీతిలో బ్యాటింగ్ చేయకపోవడంతో మ్యాచ్ చేజారింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 34 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఒక ఫోర్ కొట్టి జొనసేన్ బౌలింగ్‌లో గార్డ్నర్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయింది. ఓపెనర్లు స్మృతి మందన(11), షఫాలీ వర్మ(2) కొద్ది పరుగులకే చేతులెత్తేశారు. రోడ్రిగ్యూస్ ఒక్క పరుగు కూడా చేయకుండానే జొనసేన్ బౌలింగ్‌లో నికోలా క్యారీకి క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టింది. ఆ తర్వాత కూడా టీమిండియా పరిస్థితి మారలేదు. చివరికి 19.1 ఓవర్లకు 99 పరుగులకు ఆలౌటయ్యింది.