Ind vs Aus : ఇదేం ఫీల్డింగ్ రా నాయనా..! టీమిండియా చెత్త ఫీల్డింగ్ పై సన్నీ సెటైర్లు

sunil gavaskar

Ind vs Aus : అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా చెత్త ఫీల్డింగ్ పై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ తన దైన శైలిలో స్పందించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌‌లో భారత ఆటగాళ్లు పలు క్యాచ్‌లు జారవిడిచారు. నాసిరకమైన ఫీల్డింగ్ తో ఆస్ట్రేలియా టీమ్ కొలుకునేలా చేశారు. దీనిపై సునీల్‌ గావస్కర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

  • Share this:
    అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా చెత్త ఫీల్డింగ్ పై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ తన దైన శైలిలో స్పందించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌‌లో భారత ఆటగాళ్లు పలు క్యాచ్‌లు జారవిడిచారు. నాసిరకమైన ఫీల్డింగ్ తో ఆస్ట్రేలియా టీమ్ కొలుకునేలా చేశారు. దీనిపై సునీల్‌ గావస్కర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా ఆటగాళ్ల వరస్ట్‌ ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియాకు వారం ముందుగానే క్రిస్‌మస్‌ పండుగ వచ్చిందని ఎద్దేవా చేశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 23వ ఓవర్‌లో మార్నస్‌ లబుషేన్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పృథ్వీ షా నేలపాల్జేశాడు. దీనిపై గావస్కర్‌ స్పందిస్తూ.. క్రిస్‌మస్‌ మూడ్‌లో ఉన్న భారతీయులు వారం ముందుగానే బహుమతులు పంచిపెట్టారని వ్యాఖ్యానించాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో లబుషేన్‌ క్యాచ్‌ను జస్‌ప్రీత్‌ బుమ్రా జారవిడిచాడు. భారత ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు వదిలేయడంతో ఆసీస్‌పై మరింత ఒత్తిడి పెంచే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది.

    ఇక అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. బ్యాట్స్ మెన్ విఫలమైన చోట రాణించి టీమిండియాకు ఆధిక్యం సంపాందించారు. తొలి డే/నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్‌ (4/55), ఉమేశ్ యాదవ్ (3/40), బుమ్రా (2/52) ఆసీస్‌ జట్టును బెంబేలెత్తించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో‌ కెప్టెన్‌ టిమ్ పైన్ (73*) ఒంటరి పోరాటం చేశాడు. మరో బ్యాట్స్ మెన్ లబుషేన్‌ (47) రాణించాడు. టీమిండియా ఫీల్డింగ్ నాసిరకంగా ఉండటంతో ఆస్ట్రేలియా ఈ మాత్రం స్కోరైనా చేసింది. లేకపోతే ఆస్ట్రేలియా టీమ్ ఎప్పుడో ఆలౌట్ అవ్వాల్సి ఉంది.






    మరోవైపు మళ్లీ బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో డకౌటైన పృథ్వీషా మరో సారి నిరాశపర్చాడు. కేవలం నాలుగు పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఇక వన్ డౌన్ లో నైట్ వాచ్ మెన్ బుమ్రా బ్యాటింగ్ కు దిగాడు. మయాంక్, బుమ్రా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి భారత్ 9 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 62 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
    Published by:Sridhar Reddy
    First published: