Ind vs Aus 5th ODI : ఢిల్లీలో భారత్ ఆస్ట్రేలియా ఐదో వన్డే... గెలిచిన జట్టుదే సిరీస్

హ్యాట్రిక్ విజయాలు సాధించి అదరగొట్టింది...

India vs Australia 5Th ODI : ఐదు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌ ప్రస్తుతం 2-2గా ఉంది. ఇవాళ్టి మ్యాచ్ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్.

  • Share this:
జనరల్‌గా ఏ జట్టైనా తమ సొంత గడ్డపై విజయాలు సాధిస్తుంది. విదేశాల్లో ఓడిపోతూ ఉంటుంది. టీంఇండియా మాత్రం ఆస్ట్రేలియాలో సిరీస్‌లు సాధించి... అదే కంగారూ జట్టుతో... సొంత గడ్డపై ఓడిపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవుతూ... ప్రపంచకప్‌కి ఫేవరెట్‌గా బరిలో దిగాల్సిన జట్టు అంచనాలు తలకిందులు చేస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి మొదలైన టోర్నీలో మొదటి 2 టీ20 మ్యాచ్‌లూ ఓడిన టీంఇండియా, వన్డేల్లో 2 వరుస మ్యాచ్‌లు గెలిచింది. మూడో వన్డే కూడా గెలిచి 5 మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావించారు. అనూహ్యంగా పుంజుకున్న కంగారూలు... ఫేట్ తిప్పేశారు. మూడో వన్డేలో ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి ఏకంగా 313 రన్స్ చేశారు. అంత భారీ లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది. 281 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 358 పరుగుల భారీ లక్ష్యంతో కంగారూలకు సవాల్ విసిరింది. కానీ బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఫెయిలై... ఆ మ్యాచ్ కూడా ఆసీస్ చేతిలో పెట్టింది. ఐదు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌ ప్రస్తుతం 2-2గా ఉంది. ఇవాళ్టి మ్యాచ్ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్.

ప్రపంచకప్‌కి ముందు చివరి వన్డే : నాలుగో వన్డేలో పరుగుల వరద పారించడంలో ఓపెనర్ల కృషి ఉంది. మొదటి వికెట్‌కు 193 పరగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. శిఖర్ ధావన్ సెంచరీ చేసి తన వన్డే కెరీర్‌లో బెస్ట్ స్కోర్ ఇచ్చాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా సెంచరీ చెయ్యబోయి వికెట్ చేజార్చుకున్నాడు. బట్ ఆ మ్యాచ్ గెలిచివుంటే... ఫ్యాన్స్‌లో జోష్ మరోలా ఉండేది. ఇప్పటివరకూ భారత్‌కు బౌలింగ్, ఫీల్డింగ్ బాగుందని అనుకుంటుంటే... అంత సీన్ లేదని తాజా వన్డే సిరీస్ బయటపెట్టింది. ప్రధానంగా ఫీల్డింగ్‌లో మన ఆటగాళ్లు వేగంగా కదల్లేకపోతున్నారు. రిషభ్ పంత్... ఆస్టన్ టర్నర్‌ను రెండు సార్లు స్టంపింగ్ చేసే ఛాన్స్ మిస్సయ్యాడు. ధావన్ క్యాచ్‌లు వదిలేయడం కూడా భారత్ గెలుపు అవకాశాల్ని దూరం చేసింది.

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో తేమ ఎక్కువగా ఉండదు. అందువల్ల రెండు జట్లూ భారీ స్కోర్లు చేసే అవకాశాలున్నాయి. ఈ విషయంలో భారత బౌలర్లు అలర్ట్‌గా ఉండకపోతే... మ్యాచ్‌తో పాటూ సిరీస్‌ని కూడా ఆసీస్‌కి అప్పగించే ప్రమాదం ఉంది.

 

ఇవి కూడా చదవండి :

ఇంటికి ఎలాంటి కలర్స్ వేస్తే మంచిది... కలర్స్ ప్రభావం మనపై ఎలా ఉంటుంది?

శనగపిండి షర్బత్ ట్రై చేశారా... ఎండాకాలంలో తాగాల్సిన డ్రింక్

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...

ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...
First published: