Ind vs Aus 2020 : రెండో టెస్ట్ లో 4-5 మార్పులు ఖాయం.. తుది జట్టులో చోటు ఎవరిదంటే..?

team india (image credit : bcci)

Ind vs Aus 2020 : అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆధిక్యం సంపాందించినా.. రెండో ఇన్నింగ్స్ లో చెత్త బ్యాటింగ్ తో అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ ఓటమిని మర్చిపోయి రెండో టెస్ట్ నుంచి రాణించాలని టీమిండియా భావిస్తోంది. అందుకనుగుణంగా జట్టులో మార్పులు చేయాలని జట్టు మేనేజ్ మెంట్ యోచిస్తోంది.

  • Share this:
    అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆధిక్యం సంపాందించినా.. రెండో ఇన్నింగ్స్ లో చెత్త బ్యాటింగ్ తో అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ ఓటమిని మర్చిపోయి రెండో టెస్ట్ నుంచి రాణించాలని టీమిండియా భావిస్తోంది. అందుకనుగుణంగా జట్టులో మార్పులు చేయాలని జట్టు మేనేజ్ మెంట్ యోచిస్తోంది. ఫస్ట్ టెస్ట్ లో ఫెయిలైన ఆటగాళ్లను పక్కన పెట్టాలన్న ప్లాన్ లో ఉంది. ఇక రెండో టెస్ట్ కి కెప్టెన్ కోహ్లీ అందుబాటులో ఉండడు. పితృత్వపు సెలవుల మీద కోహ్లీ భారత్ కు తిరిగి రానున్నాడు. కోహ్లీ కి బదులు రహానే రెండో టెస్ట్ కి నాయకత్వం వహించనున్నాడు. రెండో టెస్ట్ లో నాలుగు నుంచి ఐదు మార్పులు జరిగే అవకాశాలు కన్పిస్తోన్నాయ్. కోహ్లీ భారత్ కు తిరిగిరానుండటంతో అతడి ప్లేస్ లో కేఎల్ రాహుల్ కి చోటు ఖాయంగా కన్పిస్తోంది.

    ఫస్ట్ టెస్ట్ లో బ్యాటింగ్, ఫీల్డింగ్ లో చెత్త ప్రదర్శన చేసి విమర్శల పాలైన పృథ్వీ షా ప్లేస్ లో శుభ్ మన్ గిల్ కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో గిల్ హాఫ్ సెంచరీతో టచ్ లో ఉన్నాడు. ఇక గాయపడ్డ షమీ స్థానంలో మహ్మద్ సిరాజ్ కు చోటు దక్కనుంది. కీపర్ సాహా పై కూడా రెండో టెస్ట్ లో వేటు పడే అవకాశం కన్పిస్తోంది. అతని ప్లేస్ లో ప్రాక్టీస్ మ్యాచ్ లో సూపర్ సెంచరీతో చెలరేగిన పాకెట్ డైనమైట్ రిషబ్ పంత్ కు చోటు దక్కనుంది.

    మరోవైపు హనుమ విహారీ బదులు గాయం నుంచి కోలుకున్న ఆల్ రౌండర్ జడేజాను తీసుకునే అవకాశం లేకపోలేదు.ఇలా జట్టులో నాలుగు నుంచి ఐదు మార్పులు ఖాయంగా కన్పిస్తున్నాయ్. రెండో టెస్ట్ ఈ నెల 26 నుంచి మెల్ బోర్న్ వేదికగా జరగనుంది.
    Published by:Sridhar Reddy
    First published: