బ్రిస్బేన్:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి నాల్గో టెస్టు మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ మధ్యలోనే నిలిచిపోయింది. అప్పటికి భారత్ 62/2 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఛెతేశ్వర్ పుజారా(8), అజింక్య రహానె(2) క్రీజులో ఉన్నారు. ఇన్ని్ంగ్స్ ఆరంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలోనే శుభ్‌మన్ గిల్(7) వికెట్ కోల్పోయింది. కమిన్స్ వేసిన 6 ఓవర్లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ చేతికి చిక్కాడు. అర్ధశతకానికి దగ్గరగా ఉన్న హిట్‌మ్యాన్‌ను లైయన్ ఔట్ చేశాడు. ఊరించే బంతి వేయడంతో భారీ షాట్ రోహిత్.. మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 60 పరుగులకు రెండో వికెట్లు కోల్పోయింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు 274/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆటను ప్రారంభించిన ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. శనివారం ఆటలో పైన్, కామెరూన్ గ్రీన్‌లు ఆకట్టుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారీ స్కోర్ సాధించే దిశగా సాగుతున్న వీరి భాగాస్వామ్యాన్ని శార్దుల్ ఠాకుర్ విడదీశాడు. అర్ధశతకంతో దాటిగా ఆడుతున్న పైన్ శార్దుల్ బౌలింగ్‌లో స్లిప్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్(47) వాషింగ్టన్ సుందర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత టెయిలెండర్లలు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరకు స్టార్క్ 20 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. లయన్ 24 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో బౌలర్లలో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్లు మూడు వికెట్లు సాధించగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
Published by:Rekulapally Saichand
First published:January 16, 2021, 12:22 IST