Ind vs Aus : ధోనీని మించిన రిషభ్ పంత్.. ఖాతాలోకి సరికొత్త రికార్డు

Risabh Pant

Ind vs Aus : టీమిండియా వికెట్ కీప‌ర్.. యంగ్ బ్యాట్స్ మన్ రిష‌బ్ పంత్‌.. బ్రిస్బేన్ టెస్ట్‌లో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో అత‌డు లెజెండ‌రీ వికెట్ కీప‌ర్ ఎమ్మెస్ ధోనీని మించిపోయాడు.

  • Share this:
    టీమిండియా వికెట్ కీప‌ర్.. యంగ్ బ్యాట్స్ మన్ రిష‌బ్ పంత్‌.. బ్రిస్బేన్ టెస్ట్‌లో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో అత‌డు లెజెండ‌రీ వికెట్ కీప‌ర్ ఎమ్మెస్ ధోనీని మించిపోయాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ఇండియ‌న్ వికెట్ కీప‌ర్‌గా పంత్ నిలిచాడు. కెరీర్ లో 16వ టెస్ట్ ఆడుతున్న పంత్‌.. త‌న 27వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. అత‌ని కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 2 సెంచ‌రీలు, 3 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. పంత్ కంటే ముందు ధోనీ 32 ఇన్నింగ్స్‌లో టెస్టుల్లో 1000 ప‌రుగుల మైల్‌స్టోన్‌ను చేరుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్న పంత్‌.. కంగారూ గ‌డ్డ‌పై త‌న ప‌రుగుల ప్ర‌వాహాన్ని కొన‌సాగిస్తున్నాడు. టెస్టుల్లో వెయ్యి ప‌రుగులు చేసిన ఏడో భార‌త వికెట్ కీప‌ర్‌గా కూడా పంత్ నిలిచాడు. మరోవైపు ఆఖరి టెస్ట్ ఐదో రోజు రసవత్తరంగా సాగుతోంది.ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు టీమిండియా బ్యాట్స్ మెన్. 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్‌ ముందు ఉంచి సవాల్‌ విసిరిన ఆసీస్‌కు అదే రీతిలో భారత బ్యాట్స్‌మెన్స్‌ సమాధానం చెబుతున్నారు.

    టీమిండియా బ్యాట్స్ మెన్ ఆస్ట్రేలియా బౌలర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటూ.. కొండంత లక్ష్యాన్ని నెమ్మదిగా కరిగిస్తున్నారు. భారత్ విజయం అందుకోవాలంటే ఇంకా 85 పరుగులు చేయాలి. ప్రస్తుతం టీమిండియా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయ్.నాలుగు పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో జతకట్టిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌‌ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్‌మెన్‌‌ గిల్‌ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

    ఆ తర్వాత పుజారా, రహానే కొంచెం సేపు ప్రతిఘటించారు. అయితే, ఫస్ట్ నుంచే దూకుడు మీద కన్పించిన రహానే అనవసరపు షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరోవైపు తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేసిన పుజారా మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే 56 పరుగులు చేసిన తర్వాత పుజారా కమిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు.
    Published by:Sridhar Reddy
    First published: