Ind vs Aus : గబ్బాలో గర్జించిన టీమిండియా..ఆఖరి టెస్ట్ తో పాటు సిరీస్ మనదే...

Ind vs Aus

Ind vs Aus : గబ్బా టెస్ట్ లో టీమిండియా రెచ్చిపోయింది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ ను కైవసం చేసుకోవడంతో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంది.

  • Share this:
    గబ్బా టెస్ట్ లో టీమిండియా రెచ్చిపోయింది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ ను కైవసం చేసుకోవడంతో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆఖరి టెస్ట్ లో మూడు  వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది టీమిండియా. దీంతో 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. యంగ్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ అదిరిపోయే బ్యాటింగ్ తో టీమిండియా అద్భుత విజయాన్ని అందించాడు. 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్‌ ముందు ఉంచి సవాల్‌ విసిరిన ఆసీస్‌కు అదే రీతిలో భారత బ్యాట్స్‌మెన్స్‌ సమాధానం చెప్పారు. నాలుగు పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో జతకట్టిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌‌ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్‌మెన్‌‌ గిల్‌ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

    ఆ తర్వాత పుజారా, రహానే కొంచెం సేపు ప్రతిఘటించారు. అయితే, ఫస్ట్ నుంచే దూకుడు మీద కన్పించిన రహానే అనవసరపు షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరోవైపు తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేసిన పుజారా మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే 56 పరుగులు చేసిన తర్వాత పుజారా కమిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత మయాంక్ తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే, ఆ తర్వా త పంత్ తనదైన స్టైల్ లో ఆడి టీమిండియాకు విక్టరీని అందించాడు. రిషభ్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా తన బ్యాట్ కు పని చెప్పడంతో టీమిండియా ఈజీగా విక్టరీ కొట్టింది. రిషభ్ పంత్ 89 పరుగులతో అజేయంగా నిలిచాడు.  ఈ విక్టరీ తో 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.


    ఫస్ట్ టెస్ట్ లో ఘోర ఓటమి తర్వాత టీమిండియా సిరీస్ గెలవడం అమోఘం. తాత్కాలిక కెప్టెన్ రహానే టీమిండియాను అద్భుతంగా ముందుండి నడిపించాడు. గత 31 టెస్టుల్లో తమకు పరాజయం తెలీని గబ్బా మైదానంలో.. అత్యుత్తమ ఎలెవన్‌ అందుబాటులో లేని భారత్‌ మట్టికరిపించింది.
    Published by:Sridhar Reddy
    First published: