హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Aus: 66బంతుల్లోనే టీమిండియా ఖేల్ ఖతం! మరి ఇంత దారుణమా భయ్యా!

Ind Vs Aus: 66బంతుల్లోనే టీమిండియా ఖేల్ ఖతం! మరి ఇంత దారుణమా భయ్యా!

రెండో వన్డేలో టీమిండియా ఓటమి

రెండో వన్డేలో టీమిండియా ఓటమి

ఆసీస్‌ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే టార్గెట్‌ను..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

విశాఖపట్నం వేదికగా ముగిసిన భారత్,ఆస్ట్రేలియా రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. అటు బ్యాటింగ్‌,ఇటు బౌలింగ్‌లోని అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.టీమిండియా నిర్ధేశించిన 118పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్‌ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే టార్గెట్‌ను రీచ్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌ ఓటమితో సిరీస్‌ 1-1తో సమం అయ్యింది. ఇక మూడో మ్యాచ్‌ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్‌.

బ్యాటింగ్‌లో చెత్త ప్రదర్శన:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ గిల్‌ డకౌట్ అయ్యాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా పడిన బంతిని అనవసర షాట్‌ ఆడి గిల్‌ తన వికెట్‌ కోల్పోయాడు. ఔటైన వెంటనే గిల్‌ గట్టిగా అరుస్తూ మైదానాన్ని వీడాడు. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో కూడా గిల్ దాదాపు ఇదే రీతిలో అవుటయ్యాడు. అయితే మొదటి మ్యాచ్ తప్పిదాల నుంచి గిల్‌ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ కూడా 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యా అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. రోహిత్‌ శర్మ(13), సూర్య కుమార్ యాదవ్ (0), రాహుల్ (9), హార్దిక్‌ పాండ్య (1) వరుసగా వెనుదిరిగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. నిలకడగా ఆడుతూ కాస్త జట్టు స్కోర్‌ను పెంచే పనిలో పడ్డట్టుగా కనిపించిన విరాట్ కోహ్లీ (31) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు త్వరగానే పెవిలియన్‌ బాట పట్టారు.చివరికి అక్షర్ పటేల్ ఒక్కడే (29*) నాటౌట్‌గా మిగిలాడు.

దిగారు.. దంచికొట్టారు:

118 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా ధాటిగా ఆడింది. తొలి ఓవర్‌ నుంచే బాదడం మొదలుపెట్టింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ బౌండరీలతో చెలరేగారు. ఈ క్రమంలోనే ఓపెనర్ మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్ష్ 28 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో ఓపెనర్ ట్రావిస్‌ హెడ్‌ కూడా 50బాదాడు. కేవలం30 బంతుల్లోనే 51 రన్స్‌ చేశాడు. ఇద్దరు కలిపి మ్యాచ్‌ను 11ఓవర్లలోనే ముగించేశారు. ఈ ఇద్దరిని ఏ దశలోనూ భారత్‌ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. సిరాజ్‌, షమీ పోటి పడి పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా సిరాజ్‌ను హెడ్‌ టార్గెట్‌ చేసి మరి బౌండరీల వర్షం కురిపించాడు. ఇక ఒక్క ఓవర్‌ వేసిన పాండ్యా ఏకంగా 18పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తానిని వైజాగ్‌ వన్డేలో టీమిండియా చెత్తగా ఆడి చిత్తుగా ఓడిపోయింది. ఎంతో దూరం నుంచి మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేద్దామని వచ్చిన అభిమానులకు నిరాశ మిగిల్చింది.

First published:

Tags: India vs australia

ఉత్తమ కథలు