news18-telugu
Updated: November 27, 2020, 4:23 PM IST
dhawan and pandya
ఆస్ట్రేలియా విధించిన 375 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో భారత్ తడబడుతుంది. కీలక వికెట్లు చేజార్చుకుని ఇబ్బందుల్లో పడింది. కరోనా విరామం అనంతరం మైదానంలోకి అడుగుపెట్టిన టీమిండియా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేడు ప్రారంభమైంది. 375 పరుగుల భారీ పరుగుల లక్ష్యంతో బరిలో టీమ్ఇండియాకు తొలి ఓవర్లోనే శుభారంభం దక్కింది. మిచెల్ స్టార్క్ వేసిన ఆ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్లలో స్టార్క్ 8 వైడ్ల వేశాడు. దాటిగా ఆడుతూ భారత ఓపెనర్లు మంచి శుభారంభం చేశారు.
5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేశారు. దాటిగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌కు హాజిల్‌వుడ్ బ్రెక్ వేశాడు. అతను వేసిన ఆరో ఓవర్లో మయాంక్ అగర్వాల్(22) ఔటయ్యాడు. దీంతో భారత్ 53 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరోసారి హేజిల్‌వుడ్ భారత్ ఇన్సింగ్స్ వేశాడు. రెండు కీలకమైన వికెట్లు తీసి 4 పరుగులే ఇచ్చాడు. సారథి విరాట్ కోహ్లీ (21; 21 బంతుల్లో 2×4, 1×6),శ్రేయస్ అయ్యర్ (2) వికెట్లు తీశాడు. దీంతో భారత్ 78 పరుగులకు మూడు వికెట్లు కోల్పొయింది.
ఆ తర్వాత కేఎల్ రాహుల్ (12; 15 బంతుల్లో 1×4) ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. ఆడమ్ జంపా వేసిన 13.3వ బంతికి స్మిత్‌కు చిక్కాడు రాహుల్. మరోవైపు వికెట్లు పడుతున్న ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తర్వాత ధావన్,పాండ్యా ఇన్నింగ్స్‌ను మెరుపువేగంతో స్కోర్‌ను పరుగులు పెట్టించారు.. 23 ఓవర్లకు భారత్ 169/4 పరుగులు చేసింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్య (55),ధావన్ (55) క్రీజ్‌లో ఉన్నారు.
Published by:
Rekulapally Saichand
First published:
November 27, 2020, 4:08 PM IST