కరోనా విరామం అనంతరం టీమిండియా మైదానంలోకి అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేడు ప్రారంభమైంది. సిడ్నీ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మెుదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ దంచికొట్టింది. భారత్ ముందు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్స్ డేవిడ్ వార్నర్(69),ఆరోన్ ఫించ్(114) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. టీమిండియా ఫీల్డింగ్,బౌలింగ్ విభాగాలో దారుణంగా విఫలమైంది. . మెుదటి 5 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా ఓపెనర్లు 27 పరుగులు చేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 126 ఇన్నింగ్సులు ఆడి ఈ 5 వేల పరుగుల మైలురాయిని పించ్ చేరుకున్నాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ 10 ఓవర్లకు 51 పరుగులు జోడించారు.
వడివడిగా పరుగులు సాధిస్తూ అర్ధ శతకాల వైపు సాగారు. చాహల్ వేసిన 18వ ఓవర్ రెండో బంతికి ఫించ్(49) భారీ సిక్స్ కొట్టి అర్ధశతం సాధించాడు. మరోవైపు వార్నర్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు కొనసాగుస్తున్నాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా 103 పరుగులకు చేసింది. ఇద్దరూ ఓపెనర్లు ఆర్ధశతకాలు సాధించి మంచి ఊపు మీద కనిపించారు. టీమిండియాకు షమి బ్రెక్ అందించాడు. 27.5 ఓవర్‌కి డేవిడ్ వార్నర్(69) ఔటయ్యాడు. బంతి బ్యాట్‌కు తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్లగా దాన్ని అంపైర్ ఔటివ్వలేదు. దీంతో రివ్యూ వెళ్ళగా అక్కడ ఔట్‌గా తేలడంతో భారత్‌కు తొలి వికెట్ లభించింది. ఆ తర్వాత వచ్చిన స్మిత్‌లో కలిసి కెప్టెన్ పించ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 34వ ఓవర్లో ఆస్ట్రేలియా 200 పరుగులు దాటింది.
వారిద్దరూ ఫోర్లు,సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోర్ పరిగెత్తించారు. ఈ క్రమంలో స్టీవ్‌స్మిత్ అర్ధశతకం సాధించిగా,ఆరోన్ ఫించ్(101) తన కెరీర్లో 17వ శతకం సాధించాడు. ఫీల్డర్ల తప్పిందాలు కూడా ఆసీస్‌కు కలిసోచ్చాయి. ధావన్ పలు క్యాచ్‌లు మిస్ చేసి బాట్స్‌మెన్స్‌కు లైఫ్ ఇచ్చాడు. దాటిగా ఆడుతున్న ఫించ్(114) బుమ్రా వేసిన 40వ ఓవర్లో ఔటయ్యాడు. షార్ట్‌పిచ్ బంతిని గాల్లోకి ఆడగా దాన్ని రాహుల్ క్యాచ్ అందుకున్నాడు. ఇక 40 ఓవర్లకు చేరుకునే సరికి ఆస్ట్రేలియా స్కోర్ 264/2కు చేరింది. చాహల్ వేసిన 41వ ఓవర్లో మార్కస్ స్టాయినిస్ డకౌటయ్యాడు. వికెట్ల వెనుకలా రాహుల్‌కు చిక్కాడు.
బుమ్రా వేసిన 40వ ఓవర్లో ఔటయ్యాడు. బుమ్రా చివరి బంతిని షార్ట్‌పిచ్‌గా వేయడంతో అతడు వికెట్ల వెనుక గాల్లోకి ఆడాడు. దాంతో రాహుల్ క్యాచ్ అందుకొని టీమ్ఇండియాకు రెండో వికెట్ అందించాడు. అంతకుముందు ఫించ్ వరుసగా రెండు బౌండరీలు బాదాడంతో పాటు మరో నాలుగు పరుగులు తీయడంతో ఈ ఓవర్లో 12 పరుగులొచ్చాయి. 40 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ 264/2గా నమోదైంది.
మాక్స్వెల్(45),స్మిత్(105) డాషింగ్ బ్యాటింగ్‌తో అలరించారు. ఐపీఎల్ ఆశించిన స్థాయిలో రాణించని మాక్స్ ఈ వన్డేలో మాత్రం దాటిగా ఆడాడు. చివరకు షమి వేసిన 45వ ఓవర్లో మాక్స్వెల్(45) ఔటయ్యాడు. తర్వాత కూడా స్మిత్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తిచేశాడు. చివరకు ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరోన్ ఫించ్(114; 124 బంతుల్లో 9x4, 3x6), డేవిడ్ వార్నర్(69; 76 బంతుల్లో 6x4) ,స్టీవ్‌స్మిత్(101; 66 బంతుల్లో 11x4, 4x6), గ్లెన్ మాక్స్వెల్(45; 19 బంతుల్లో 5x4, 3x6) సూపర్ బ్యాటింగ్‌తో ఆదరగొట్టారు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో షమి 3 వికెట్లు పడగొట్టగా... బుమ్రా, సైని, చాహల్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.