news18-telugu
Updated: December 1, 2020, 1:29 PM IST
Team india
ఆసీస్ టూర్లో భారత్ పేలవమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేలో కూడా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. కరోనా విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియాపై అభిమానలు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలు తగ్గట్టుగా జట్టు రాణించడం లేదు. రెండు బలమైన జట్లే కావడంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయని ప్యాన్స్ అంచనా వేశారు. కానీ రెండు పరాజయాలతో భారత్ సిరీస్‌ను కోల్పోయింది. చెత్త బౌలింగ్‌తోనే తగిన మూల్యం చెల్లించుకుంది.
బుధవారం జరిగే చివరి వన్డే మ్యాచ్ అయిన గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. దీంతో బౌలింగ్‌లో కీలక మార్పులు చేయాలని భావిస్తోంది. రెండు వన్డేల్లోనూ ఆసీస్ 350 పరుగులకు పైగా సాధించింది అంటే భారత బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. చివరి వన్డేలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. బుమ్రా,చాహల్,సైనీని పక్కకు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రెండు మ్యాచ్‌ల్లో బుమ్రా రెండు వికెట్లు తీసి 152 రన్స్ ఇచ్చాడు. ఇక చాహల్ 19 ఓవర్లు వేసి 160 పరుగులిచ్చాడు. బుమ్రా, చాహల్ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనిపించలేదు. మూడో వన్డే నామాత్రమే కావడంతో వీరిద్దరిని పక్కకు పెట్టి అవకాశం ఉంది. బుమ్రా స్థానంలో దీపక్ చహర్‌కు చాన్స్ ఇచ్చే అవకాశం ఉండగా.. ఇక యార్కర్ల స్పెషలిస్ట్ టి. నటరాజన్‌ను సైనీ ప్లేస్‌లో, కుల్దీప్ను చాహల్ స్థానంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా రెండు వన్డేలో ఘోర ఓటమి చవిచూసింది. తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో పరాజయం చెందిన టీమిండియా..రెండో వన్డేలో 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న టీమిండియా ఇంతగా నిరాశపరుస్తోందని ఎవరూ ఊహించలేదు.
Published by:
Rekulapally Saichand
First published:
December 1, 2020, 1:29 PM IST