Ind vs Aus 2020 : ఫస్ట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆలౌట్... భారత్ కు ఆధిక్యం ఎంతంటే..

India vs Australia

Ind vs Aus 2020 : అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. బ్యాట్స్ మెన్ విఫలమైన చోట రాణించి టీమిండియాకు ఆధిక్యం సంపాందించారు. తొలి డే/నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్‌ (4/55), ఉమేశ్ యాదవ్ (3/40), బుమ్రా (2/52) ఆసీస్‌ జట్టును బెంబేలెత్తించారు.

  • Share this:
    అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. బ్యాట్స్ మెన్ విఫలమైన చోట రాణించి టీమిండియాకు ఆధిక్యం సంపాందించారు.
    తొలి డే/నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్‌ (4/55), ఉమేశ్ యాదవ్ (3/40), బుమ్రా (2/52) ఆసీస్‌ జట్టును బెంబేలెత్తించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో‌ కెప్టెన్‌ టిమ్ పైన్ (73*) ఒంటరి పోరాటం చేశాడు. మరో బ్యాట్స్ మెన్ లబుషేన్‌ (47) రాణించాడు. టీమిండియా ఫీల్డింగ్ నాసిరకంగా ఉండటంతో ఆస్ట్రేలియా ఈ మాత్రం స్కోరైనా చేసింది. లేకపోతే ఆస్ట్రేలియా టీమ్ ఎప్పుడో ఆలౌట్ అవ్వాల్సి ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ తడబడుతున్నా.. ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఎక్కడా తడబాటు కన్పించలేదు. చివరికి 73 పరుగులతో టిమ్ అజేయంగా నిలిచాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం లభించింది.


    అంతకు ముందు వృద్ధిమాన్‌ సాహా (9), రవిచంద్రన్‌ అశ్విన్ (15) క్రీజులో పాతుకుపోయి టీమిండియా భారీస్కోరుకు బాటలు వేస్తారనుకుంటే నిరాశే మిగిలింది. అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 93.1 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీసేన 23 నిమిషాల్లోనే వెనుదిరిగింది. 25 బంతుల్లో 11 పరుగులే చేసి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. స్టార్క్‌ (4/53), కమిన్స్ (3/48)లు రాణించారు. చివర్లో చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

    233/6తో ఆటను ఆరంభించిన భారత్‌ కమిన్స్‌ వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. మూడో బంతికి రవిచంద్రన్‌ అశ్విన్‌ వికెట్‌కీపర్‌ టిమ్‌ పైన్‌ చేతికి చిక్కాడు. టెయిలెండర్లతో కలిసి సాహా జట్టు బాధ్యతలను మోస్తాడనుకుంటే తర్వాతి ఓవర్‌లోనే అతడు నిష్క్రమించాడు. స్టార్క్‌ వేసిన బంతిని షాట్‌కు యత్నించి వికెట్‌కీపర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌ (6), షమి కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. బుమ్రా (4*) నాటౌట్‌గా నిలిచాడు.
    Published by:Sridhar Reddy
    First published: