news18-telugu
Updated: November 27, 2020, 10:48 PM IST
హార్దిక్ పాండ్యా (Image:BCCI)
ఆస్ట్రేలియా-ఇండియా తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్‌గా అవతారమెత్తి.. ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 76 బంతుల్లో 90 పరుగులు సాధించాడు. ఇందులో 4 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. టీమిండియా బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ.. జట్టును ఆదుకొని శభాష్ అనిపించాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో అరుదైన ఫీట్ సాధించాడు హార్దిక్ పాండ్యా. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు.
వన్డేల్లో కేవలం 857 బంతుల్లోనే హార్దిక్ పాండ్యా 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇండియా తరపున ఇంకెవరూ ఇంత తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు చేయలేదు. ఇక వేగంగా వెయ్యి పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ప్రపంచపవ్యాప్తంగా పాండ్యా ఐదో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో రస్సెల్, రెండో స్థానంలో ల్యూక్ రాంచీ, మూడో స్థానంలో ఆఫ్రిది, నాలుగో స్థానంలో కోరే అండర్సన్ ఉన్నారు.
1. ఆండ్రూ రస్సెల్ (వెస్టిండీస్) - 787 బంతులు
2. ల్యూక్ రాంచీ (న్యూజిలాండ్) - 807 బంతులు
3. షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్) - 834 బంతులు
4. కోరే అండర్సన్ (న్యూజిలాండ్) - 854 బంతులు
5. హార్దిక్ పాండ్యా (ఇండియా) - 857 బంతులు
కాగా, సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. 66 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ (114), స్టీవ్ స్మిత్ (105) సెంచరీలతో చెలరేగా.. వార్నర్ (69), మాక్స్వెల్ (45) రన్స్‌తో ఆకట్టుకున్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 రన్స్ మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్యా 90, శిఖర్ ధావన్ 74 పరుగులు చేశారు. మిగతావారు పెద్దగా రాణించలేదు. జంపా 4, హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 27, 2020, 10:42 PM IST