India vs Afghanistan | మ్యాచ్ గెలిచిన భారత్... మనసు గెలిచిన ఆఫ్గనిస్థాన్

India vs Afghanistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Southampton: భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. భారత్ విధించిన 225 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో, ఆఫ్గన్ బౌలర్లో చివరి ఓవర్లో తడబడ్డారు. చివరి ఓవర్లో షమి వరుసగా మూడు వికెట్లతో హ్యాట్రిక్ తీయడంతో ఆఫ్గనిస్థాన్ విజయానికి దూరమైంది.

news18-telugu
Updated: June 22, 2019, 11:10 PM IST
India vs Afghanistan | మ్యాచ్ గెలిచిన భారత్... మనసు గెలిచిన ఆఫ్గనిస్థాన్
విజయోత్సాహంలో కోహ్లీ సేన
  • Share this:
India vs Afghanistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Southampton: సౌతంప్టన్ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. భారత్ విధించిన 225 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో, ఆఫ్గన్ బ్యాట్స్ మెన్ చివరి ఓవర్లో తడబడ్డారు. చివరి ఓవర్లో షమి వరుసగా మూడు వికెట్లతో హ్యాట్రిక్  వికెట్లు పడగొట్టడంతో ఆఫ్గనిస్తాన్ పై భారత్ 11 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. ఆఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ లో ఒక బంతి మిగిలి ఉండగా, 49.5 ఓవర్లకు 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  ఇదిలా ఉంటే ఆఫ్గన్ ఓపెనర్లు బ్యాటింగ్ నిలకడగా మొదలు పెట్టినప్పటికీ ఓపెనర్ హజరత్ (10) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. అయినప్పటికీ గుల్బదిన్ నయిబ్ (27), రహ్మత్ షా(36), షహీదీ(21) లు రాణించడంతో ఆఫ్గన్ బ్యాట్స్ మెన్ భారత్ విధించిన టార్గెట్ ఛేదన దిశగా కదిలింది. ముఖ్యంగా చివర్లో మహ్మద్ నబి(52) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఓవర్లో ఆఫ్గన్ విజయానికి 16 పరుగుల దూరంలో నిలవగా నబి ఔట్ కావడంతో మ్యాచ్ ఫలితం తారుమారవగా భారత్ విజయం సాధించింది.

ఇదిలా ఉంటే, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. భారత్ తరపున ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం ఒక పరుగుకే ఔటవ్వడంతో ఆఫ్గన్ తొలి షాక్ ఇచ్చింది. అయినప్పటికీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (30), కోహ్లీ (67) పరుగులు చేయడంతో స్కోరు బోర్డు కదిలింది. అయితే ధోనీ (28), జాదవ్ (52) రాణించడంతో టీమిండియా స్కోరు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు సాధించింది. ఆఫ్గన్ బౌలర్లు రెగ్యులర్ గా వికెట్లు సాధిస్తూ టీమిండియా బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. ఆఫ్గన్ బౌలర్లలో నయిబ్, నబి చెరో 2 వికెట్లు తీయగా, ముజీబ్, అఫ్తాబ్, రషీద్ ఖాన్, రహ్మత్ చెరో ఒక వికెట్ సాధించారు.
Published by: Krishna Adithya
First published: June 22, 2019, 11:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading