బీసీసీఐ కీలక నిర్ణయం.. బెంగళూర్ నుంచి అహ్మదాబాద్‌కు మారిన..

శుక్రవారం జరిగిన బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో, శిక్షణా శిబిరంపై చర్చించారు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీతో సహా పలు వేదికలకు పరిగణిలోకి తీసుకున్న బోర్డు, చివరకు అత్యాధునిక శిక్షణా సదుపాయాలతో కూడిన అహ్మదాబాద్ మోటెరా స్టేడియంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Updated: July 21, 2020, 7:23 PM IST
బీసీసీఐ కీలక నిర్ణయం.. బెంగళూర్ నుంచి అహ్మదాబాద్‌కు మారిన..
శుక్రవారం జరిగిన బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో, శిక్షణా శిబిరంపై చర్చించారు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీతో సహా పలు వేదికలకు పరిగణిలోకి తీసుకున్న బోర్డు, చివరకు అత్యాధునిక శిక్షణా సదుపాయాలతో కూడిన అహ్మదాబాద్ మోటెరా స్టేడియంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా ఆటగాళ్ళకు ఇనాళ్ళు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీసీసీఐ త్వరలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దమవుతుంది. అహ్మదాబాద్‌లోని మోటెరా స్టేడియంలో శిక్షణ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు వరకు ఆటగాళ్లకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసే అవకాశం లేదని గంగూలీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా టూర్ ఉండడంతో క్రికెటర్స్‌కు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం అనివార్యమైంది.

శుక్రవారం జరిగిన బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో, శిక్షణా శిబిరంపై చర్చించారు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీతో సహా పలు వేదికలకు పరిగణిలోకి తీసుకున్న బోర్డు, చివరకు అత్యాధునిక శిక్షణా సదుపాయాలతో కూడిన అహ్మదాబాద్ మోటెరా స్టేడియంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

బెంగళూర్ నగరంలో విపరీతంగా కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెటర్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని,అందుకే అహ్మదాబాద్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ఒక్కరు ఎఎన్ఐకి తెలిపారు.
Published by: Rekulapally Saichand
First published: July 21, 2020, 7:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading