Home /News /sports /

INDIA TOUR OF SRILANKA FIXED SLC RELEASED THE SCHEDULE DRAVID WILL BE TEAM INDIA COACH JNK

INDvsSL : శ్రీలంక టూర్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఎల్‌సీ.. టీమ్ ఇండియా కోచ్ ఎవరో తెలుసా?

శ్రీలంకలో భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ షెడ్యూల్ విడుదల

శ్రీలంకలో భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ షెడ్యూల్ విడుదల

శ్రీలంకకు టీమ్ ఇండియా 'బి' జట్టును పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. జులై లో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లి మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నది. టీమ్ ఇండియాకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నది.

    బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలి సారిగా ఒక ప్రయోగం చేయబోతున్నది. టీమ్ ఇండియా (Team India) టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే.. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన మరో జట్టును శ్రీలంకకు (Srilanka Tour) పంపనున్నది. ఈ నెల 29న విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్నది. జూన్ 18 నుంచి 22 వరకు జరుగనున్న ఫైనల్ తర్వాత నెల రోజులకు ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్నది. ఈ మధ్యలో భారత జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనున్నది. కాగా, కరోనా కారణంగా పలు దేశాల ప్రయాణాలపై ఆంక్షలు ఉండటం.. బయోబబుల్ దాటి బయటకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో టెస్టు జట్టు ఇంగ్లాండ్‌లోనే ఉండిపోనున్నది. అయితే ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాంలో బాగంగా గత ఏడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనకు వేరే జట్టును పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. కాగా, జులైలో జరుగనున్న ఈ ద్వైపాక్షిక సిరీస్‌కు సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. కాగా, తొలుత భావించినట్లు ఐదు టీ20, 3 వన్డేలు కాకుండా.. 3 టీ20లు, 3 వన్డేలు ఆడాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆ మేరకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) కి సమాచారం అందించడంతో షెడ్యూల్ కూడా ఆరు మ్యాచ్‌లకు విడుదల చేసింది.

    భారత జట్టు శ్రీలంకలో జులై 13 నుంచి 27 వరకు మూడు వన్డేలు, మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నది. జులై 13, 16, 19న వన్డే మ్యాచ్‌లు, జులై 22, 24, 27న టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు కొలంబోలోనే నిర్వహించనున్నట్లు శ్రీలంక క్రికెట్ తెలిపింది. ఇరు జట్లు ముందుగానే కొలంబోలో బయోబబుల్‌లోకి ప్రవేశించనున్నట్లు ఎస్ఎల్‌సీ వెల్లడించింది.

    Cricket: కరోనాతో క్రికెట్ బోర్డుల షెడ్యూల్ అతలాకుతలం.. ఏడాదిగా ఎన్ని సిరీస్‌లు రద్దయ్యాయో తెలుసా?
     ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమీ లేకుండానే శ్రీలంక పర్యటన జరుగనున్నది. కాగా, ఈ సిరీస్ కోసం పరిమిత ఓవర్ల స్పెషలిస్టు క్రికెటర్లను పంపుతామని ఇప్పటికే సౌరవ్ గంగూలీ వెల్లడించారు. బీసీసీఐ అధికారులు చెబుతున్న దాన్ని బట్టి ఇప్పటికే కొంత మంది క్రికెటర్లను జాబితాలో చేర్చినట్లు తెలుస్తున్నది. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, యుజువేంద్ర చాహల్, సంజూ శాంసన్, పృథ్వీ షా, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, జయదేవ్ ఉనద్కత్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాతియా పేర్లు ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తున్నది. వీరితో పాటు సూర్యుకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా శ్రీలంక వెళ్లే అవకాశం ఉన్నది.


    మరోవైపు టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు ఇతర సిబ్బంది కూడా ఇంగ్లాండ్ పర్యటనలోనే ఉండనున్నారు. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌ను టీమ్ ఇండియాతో శ్రీలంక పంపాలని భావిస్తున్నారు. ద్రవిడ్ కోచ్‌గా ఎన్ఏసీకి చెందిన ఇతర సిబ్బంది కూడా జట్టుతో శ్రీలంక వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, Cricket, India vs srilanka, Rahul dravid, Team india

    తదుపరి వార్తలు