Home /News /sports /

Team India: నేడు దక్షిణాఫ్రికా వెళ్లనున్న టీమ్ ఇండియా ప్రకటన.. కోహ్లీకే వన్డే కెప్టెన్సీ?

Team India: నేడు దక్షిణాఫ్రికా వెళ్లనున్న టీమ్ ఇండియా ప్రకటన.. కోహ్లీకే వన్డే కెప్టెన్సీ?

దక్షిణాఫ్రికా వెళ్లే టీమ్ ఇండియాను నేడు ప్రకటించే అవకాశం (BCCI)

దక్షిణాఫ్రికా వెళ్లే టీమ్ ఇండియాను నేడు ప్రకటించే అవకాశం (BCCI)

Team India: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు ఈ నెల 16న బేటీ కానున్నది. మంగళవారం సుదీర్ఘంగా బేటీ అయిన జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత జట్టు ఎంపికపై తీవ్రమైన కసరత్తు చేసింది. బుధవారం సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించనున్నారు.

ఇంకా చదవండి ...
    భారత జట్టు (Team India) త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు (South Africa Tour) వెళ్లనున్నది. ఈ నెల 16న భారత జట్టు ముంబై నుంచి జొహన్నస్‌బర్గ్ ప్రయాణం చేయాల్సి ఉన్నంది. అయితే దక్షిణాఫ్రికా వెళ్లే భారత జట్టును ఎంపిక చేయడానికి మంగళవారం మధ్యాహ్నం చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సినీయర్ సెలెక్షన్ కమిటీ (Senior Selection Committee) ముంబైలో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కెప్టెన్ కోహ్లీ (Virat Kohli), కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో (Rahul Dravid) పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పాల్గొన్నట్లు తెలుస్తున్నది. గత కొన్నాళ్లుగా ఫామ్‌లో లేని అజింక్య రహానేను టెస్టు జట్టులో కొనసాగించాలా? లేదా అనే విషయంపై తీవ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతానికి రహానేను దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇక వన్డే కెప్టెన్సీలో కూడా ఎలాంటా మార్పు ఉండబోదు. విరాట్ కోహ్లీనే వన్డే జట్టుకు కూడా కెప్టెన్‌గా కొనసాగించనున్నారు. మొత్తం 20 మందితో కూడిన టెస్టు జట్టును బుధవారం ఉదయం ప్రకటించే అవకాశం ఉన్నది. వన్డే జట్టును మాత్రం కాస్త ఆలస్యంగా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది.

    భారత టెస్టు జట్టు ఎంపికమై సెలెక్షన్ కమిటీ తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తున్నది. అజింక్య రహానేను వైస్ కెప్టెన్‌గానే కొనసాగించనున్నట్లు తెలుస్తున్నది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే రోహిత్‌కు వైస్ కెప్టెన్సీని కట్టబెట్టే ఆలోచన లేనట్లు తెలుస్తున్నది. 20 మందితో కూడిన జట్టులోకి హనుమ విహారిని తీసుకునే అవకాశం ఉన్నది. విహారి ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఇండియా ఏ జట్టుతో ఉన్నాడు. అతడిని టెస్టు జట్టులోకి తీసుకోనున్నారు. రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీ కట్టబెట్టాలనే డిమాండ్ పెరిగింది.

    Pro Kabaddi League: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ కంటే ప్రో కబడ్డీలో ఈ ఆటగాళ్ల జీతం ఎక్కువ.. ఎవరు ఆ ఆటగాళ్లు?



     అయితే సెలెక్షన్ కమిటీ మాత్రం దక్షిణాఫ్రికా పర్యటనకు కోహ్లీనే పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా కొనసాగించనున్నట్లు తెలుస్తున్నది. సఫారీ పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ ఆడనున్నది. అప్పుడు మాత్రం రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉన్నది. విదేశాల్లో మంచి రికార్డు ఉన్న అజింక్య రహానేను ప్రస్తుతం టెస్టు జట్టులో కొనసాగించనున్నారు. దక్షిణాఫ్రికాలో అతడిని ప్రదర్శన మీదే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. భారత జట్టులో భారీ మార్పులు ఏమీ చేయలేదని సమాచారం.


    భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు వారం రోజుల పాటు ముంబైలో క్యాంపు నిర్వహించాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ కోరాడు. దీనికి బీసీసీఐ కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తున్నది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ బుధవారం జట్టును ప్రకటించిన వెంటనే.. అందరూ సదరు క్యాంప్‌కు చేరుకోవాలని సూచించనున్నారు. రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి, రిషబ్ పంత్, శార్దుల్ ఠాకూర్ న్యూజీలాండ్‌తో జరిగిన సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో క్యాంపు తప్పని సరిగా నిర్వహించాలని రాహుల్ ద్రవిడ్ భావించాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం తొలి సారిగా టీమ్ ఇండియా సీనియర్లు అందరూ క్యాంపులో కలువనున్నారు.

    PAK vs BAN: విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా లాగానే టెస్టుల్లో సెంచరీ కోసం ఎదురు చూస్తున్న బాబర్ అజమ్


    ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 100 టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. అందుకే వన్డే కెప్టెన్సీని ఈ సిరీస్‌కు కదిలించలేదని తెలుస్తున్నది. ఇక ఇషాంత్ శర్మ న్యూజీలాండ్ సిరీస్‌లో పెద్దగా రాణించలేదు. మహ్మద్ సిరాజ్ అతడి స్థానంలో పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నది. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ రవీంద్ర జడేజాకు చోటు దక్కవచ్చు. ఇక మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ జట్టులో ఉంటారు. అయితే కేఎల్ రాహుల్, రోహిత్ వస్తే ఇద్దరు ఓపెనర్లు బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉన్నది. ఏదేమైనా ఈ సారి మాత్రం జట్టులో భారీ మార్పులు ఏమీ చేయకుండా సీనియర్లకే పెద్ద పీట వేయనున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, India vs South Africa, Rahul dravid, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు