హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ Series : ప్రపంచకప్ ముగిసింది.. కీలక సిరీస్ కు వేళైంది.. న్యూజిలాండ్ తో సిరీస్ షెడ్యూల్ ఇదే

IND vs NZ Series : ప్రపంచకప్ ముగిసింది.. కీలక సిరీస్ కు వేళైంది.. న్యూజిలాండ్ తో సిరీస్ షెడ్యూల్ ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND vs NZ Series : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 ముగిసింది. టోర్నీ మొత్తం నిలకడగా ఆడిన ఇంగ్లండ్ (England) ఫైనల్లో పాకిస్తాన్ (Pakistan)ను ఓడించి రెండోసారి టి20 ప్రపంచకప్ చాంపియన్ గా నిలిచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ Series : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 ముగిసింది. టోర్నీ మొత్తం నిలకడగా ఆడిన ఇంగ్లండ్ (England) ఫైనల్లో పాకిస్తాన్ (Pakistan)ను ఓడించి రెండోసారి టి20 ప్రపంచకప్ చాంపియన్ గా నిలిచింది. టోర్నీ ఫేవరెట్స్ లో ఒకటిగా ఉన్న టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఇక భారత్ న్యూజిలాండ్ తో సిరీస్ కు సిద్ధమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్ (KL Rahul) లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. దాంతో టి20లకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. వన్డేలకు శిఖర్ ధావన్ సారథిగా ఉంటాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తో భారత్ మూడు టి20లు.. మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ ఈ నెల 18న ఆరంభం కానుంది

ఈ నెల 18న జరిగే తొలి టి20తో సిరీస్ ఆరంభం కానుంది. ఆ తర్వాత నవంబర్ 20, 22న రెండు టి20లు జరగనున్నాయి. ఇక నవంబర్ 25న తొలి వన్డే జరగనుంది. 27న రెండో వన్డే.. 30న మూడో వన్డే జరగనుంది.  ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను చాంపియన్ గా నిలబెట్టిన తర్వాత హార్దిక్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రెండో సిరీస్ ఇదే. అంతకుందు ఐర్లాండ్ తో సిరీస్ లో కూడా హార్దిక్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో జరిగే సిరీస్ లో జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.

మ్యాచ్ ల సమయం

టి20లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం అవుతాయి. ఇక వన్డే మ్యాచ్ లు మాత్రం భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ఆరంభం అవుతాయి. ఈ మ్యాచ్ లను ఏ చానెల్ కూడా ప్రత్యక్షప్రసారం చేయడం లేదు. అయితే డిజిటల్ లో మాత్రం లైవ్ గా చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మ్యాచ్ లను ప్రత్యక్షప్రసారం చేయనున్నాయి.

టీమిండియా జట్టు వివరాలు

టి20ల కోసం : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్

వన్డేల కోసం  : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), సంజూ సామ్సన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, చహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, దీపక్ చహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్

First published:

Tags: Hardik Pandya, India vs newzealand, Kane Williamson, Mohammed Siraj, Rishabh Pant, Sanju Samson, Team India

ఉత్తమ కథలు