Home /News /sports /

INDIA TOUR OF ENGLAND UPDATES TEAM INDIA CAPTAIN ROHIT SHARMA TESTS POSITIVE FOR COVID 19 MKS

Rohit Sharma : ఇంగ్లాండ్‌లో టీమిండియాకు షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్

రోహిత్ శర్మ (పాత ఫొటో)

రోహిత్ శర్మ (పాత ఫొటో)

టీమిండియా సారధి రోహిత్ శర్మ కరోనా వైరస్ కాటుకు గురయ్యాడు. జులై 1 నుంచి బ్రిటిష్ జట్టుతో భారత్ కీలక మ్యాచ్ ఆడాల్సి ఉండగా కెప్టెన్ కరోనా బారిన పడటం, తన ద్వారా ఇంకెవరికైనా వైరస్ సోకి ఉంటుందా అనే అనుమానాలు కలవరపెడుతున్నాయి.

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు (India tour of England) చిన్నపాటి షాక్ తగింది. టీమిండియా సారధి రోహిత్ శర్మ (Rohit Sharma) కరోనా వైరస్ (Covid-19) కాటుకు గురయ్యాడు. జులై 1 నుంచి బ్రిటిష్ జట్టుతో భారత్ కీలక మ్యాచ్ ఆడాల్సి ఉండగా కెప్టెన్ కరోనా బారిన పడటం, తన ద్వారా ఇంకెవరికైనా వైరస్ సోకి ఉంటుందా అనే అనుమానాలు కలవరపెడుతున్నాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. శనివారం నిర్వహించిన యాంటిజెన్ టెస్టుల్లో అతనికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందంటూ బీసీసీఐ ఆదివారం తెల్లవారుజామున ఒక ట్వీట్ చేసింది. ప్రస్తుతం టీమిండియా బస చేసిన హోటల్ లోనే తన గదిలో రోహిత్ క్వారంటైన్ లో ఉన్నాడు.

Teachers Assets : టీచర్ల ఆస్తుల వెల్లడి ఉత్తర్వులు వెనక్కి -అసలు కథ తెలుసా మీకు?





రోహిత్ శర్మ ప్రస్తుతం టీసెస్టర్ జట్టుతో జరుగుతోన్న వార్మప్ మ్యాచ్ లో ఆడుతున్న సంగతి తెసిందే. గురువారం తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఆయన 25 పరుగులు చేశాడు. శనివారం నాటి రెండో ఇన్నింగ్స్ లో మాత్రం బ్యాటింగ్ కు దిగలేదు. రోహిత్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఇరు జట్లలో ఆందోళన మొదలైంది.

Rishabh Pant : పంత్ కు పక్కలో బల్లెంలా మారిన వైజాగ్ కుర్రాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే?


ఇంగ్లాండ్ తో భారత్ టెస్టు సిరీస్ కు సంబంధించి గతేడాది నిలిచిపోయిన 5వ మ్యాచ్ ఈ ఏడాది జులై 1న ఆడాల్సి ఉంది. 5మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 2-1తేడాతో ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ప్రారంభంలోగా రోహిత్ శర్మ కోలుకోకుంటే రిషబ్ పంత్ లేదా జస్ప్రిత్ బుమ్రాలో ఒకరు టీమిండియాకు సారధ్యం వహించే అవకాశం ఉంటుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bcci, Covid, India, India vs england, Rohit sharma

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు