Home /News /sports /

Ind vs Aus: కొత్త జేర్సీలో శిఖర్ ధావన్...గుర్తుకొస్తున్న 28 ఏళ్ల నాటి జ్ఞాపకం!

Ind vs Aus: కొత్త జేర్సీలో శిఖర్ ధావన్...గుర్తుకొస్తున్న 28 ఏళ్ల నాటి జ్ఞాపకం!

టీమిండియా కొత్త జేర్సీ చూస్తే 28 ఏళ్ల వెనక్కి వెళ్ళీ అనాటి టీమిండియా జట్టును గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా వేదికగా 1992 వరల్డ్‌కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీలతోనే ఇప్పుడు భారత జట్టు బరిలోకి దిగుతుంది.

టీమిండియా కొత్త జేర్సీ చూస్తే 28 ఏళ్ల వెనక్కి వెళ్ళీ అనాటి టీమిండియా జట్టును గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా వేదికగా 1992 వరల్డ్‌కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీలతోనే ఇప్పుడు భారత జట్టు బరిలోకి దిగుతుంది.

టీమిండియా కొత్త జేర్సీ చూస్తే 28 ఏళ్ల వెనక్కి వెళ్ళీ అనాటి టీమిండియా జట్టును గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా వేదికగా 1992 వరల్డ్‌కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీలతోనే ఇప్పుడు భారత జట్టు బరిలోకి దిగుతుంది.  టీమిండియా కొత్త జేర్సీ చూస్తే 28 ఏళ్ల వెనక్కి వెళ్ళీ అనాటి టీమిండియా జట్టును గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా వేదికగా 1992 వరల్డ్‌కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీలతోనే ఇప్పుడు భారత జట్టు బరిలోకి దిగుతుంది. తాజాగా మొబైల్ ప్రీమియ‌ర్ లీగ్ ‌(ఎంపీఎల్) స్పోర్ట్స్‌తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తేలిసిందే. టీమిండియాకి కొత్త కిట్ స్ఫాన్సర్‌గా ఎంపీఎల్‌ను అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. ఇంతకు ముందు నైక్‌‌తో కుదుర్చున్న ఐదేళ్ల ఒప్పందం తాజాగా ముగియడంతో ఎంపీఎల్‌ను కొత్త భాగస్వామిగా నియమించుకుంది బోర్డు. త్వరలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్‌లలో ఎంపీఎల్ కొత్త జెర్సీలతో భారత ఆటగాళ్లు బరిలోకి దిగనునున్నారు.

  ఈ సంస్థ ఆటగాళ్ళకు కొత్త జెర్సీ, కొత్త కిట్లను సమకూర్చనుంది. ఇంతకు ముందు క్రికెటర్స్‌కు నైక్ సంస్థ స్పాన్సర్‌గా ఉండేది. తాజాగా ఆ సంస్థ వైదొలగడంతో ఎంపీఎల్ స్పోర్ట్స్ఆ స్థానంలోకి వచ్చింది. ఆస్ట్రేలియా సీరిస్‌లో టీమిండియా ఆ సంస్థ లోగోతో కూడిన కొత్త జెర్సీని ధరించబోనుంది.  తాజాగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కొత్త జేర్సీని ధరించి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అలాగే నాటి జెర్సీ వేసుకున్న ఆటగాళ్ళ ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. కొత్త జెర్సీతో ఈ సిరీస్‌లో బరిలోకి దిగనున్నమని గబ్బర్ ట్వీట్ చేశాడు. ఒకసారి ఆ కొత్త జేర్సీ పరిశీలిస్తే నేవీ బ్లూ కలర్‌లో భుజాలపై రంగుల చారలు ఉన్నాయి. పాత జేర్సీ కంటే ఈ జేర్సీ కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.

  కాగా, ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా వరుసగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది టీమిండియా. నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, డిసెంబరు 4 నుంచి మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. అంతేకాదు ఆస్ట్రేలియాతో తొలిసారి డే/నైట్‌ టెస్టులో తలపడనుంది టీమిండియా.
  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Australia, India, Shikhar Dhawan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు