ఆగస్టులో సౌతాఫ్రికాలో భారత జట్టు పర్యటన?

క్రికెట్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆగస్ట్ చివర్లో టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: May 21, 2020, 6:27 PM IST
ఆగస్టులో సౌతాఫ్రికాలో భారత జట్టు పర్యటన?
టీమిండియా
  • Share this:
కరోనా వైరస్ దెబ్బ క్రికెట్ మీద కూడా బాగా పడింది. అయితే, క్రికెట్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆగస్ట్ చివర్లో టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ మూడు టీ20లు ఆడే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం రెండు దేశాల క్రికెట్ బోర్డులు సిద్ధంగా ఉన్నా, రెండు ప్రభుత్వాల నుంచి అధికారికంగా అనుమతులు రావాల్సి ఉంది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ మధ్య జరిగిన చర్చల సారంశంగా బుధవారం ఈ మ్యాచ్‌లు ఫైనల్ అయినట్టు తెలిసింది. భారత జట్టు సౌతాఫ్రికా టూర్‌ వార్తను క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫాల్ ధ్రువీకరించారు. ‘భారత జట్టు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటోంది. అది అనుకున్న సమయానికే కావొచ్చు. లేకపోతే కొంచెం ఆలస్యం కావొచ్చు.’ అని వర్చువల్ ప్రెస్ మీట్‌లో జాక్వెస్ పాల్ అన్నారు. టీమిండియాల్ చివరిసారిగా 2018లో సౌతాఫ్రికాలో పర్యటించింది. మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడింది. టెస్ట్ సిరిస్ 1-2 తేడాతో ఓడిన తర్వాత భారత్ పుంజుకుంది. వన్డేల్లో 5-1, టీ 20ల్లో 2- 1 తేడాతో విజయం సాధించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 21, 2020, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading