ఇంగ్లండ్‌తో వన్డే వార్‌కు రెడీ ..హాట్‌ఫేవరెట్‌గా విరాట్ సేన

వన్డే టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్‌కు..రెండో ర్యాంకర్ ఇండియా సవాల్ విసురుతోంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో సొంతం చేసుకున్న భారత్..జోరు మీదుంది.3 వన్డేల సిరీస్‌‌లో భారత జట్టు‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

news18-telugu
Updated: July 10, 2018, 6:37 PM IST
ఇంగ్లండ్‌తో వన్డే వార్‌కు రెడీ ..హాట్‌ఫేవరెట్‌గా విరాట్ సేన
ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్‌తో ధోనీ
  • Share this:
ట్వంటీ ట్వంటీ సిరీస్‌లో తిరుగులేని టీమిండియా..ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతోంది.ఇంగ్లీష్ టీమ్‌పై వన్డే సిరీస్‌లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా విరాట్ సేన బరిలోకి దిగనుంది.ఇన్‌స్టంట్ ఫార్మాట్‌లో 2 సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఇండియా ప్రస్తుతం వన్డేల్లో 2వ ర్యాంక్‌లో ఉండగా,ఇంగ్లండ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.

ఇంగ్లండ్‌పై 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న భారత్..జోరు మీదుంది.వన్డే సిరీస్‌లోనూ దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.టీమ్ కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేయకుండా ఇంగ్లండ్ జట్టుకు చెక్ పెట్టాలని కోచ్ రవిశాస్త్రి,కెప్టెన్ విరాట్ కొహ్లీ ధీమాగా ఉన్నారు.

ఇండియా,ఇంగ్లండ్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్


12 జూలై నాటింగ్‌హామ్ వేదికగా తొలి వన్డే,14న లండన్ వేదికగా రెండో వన్డే,17న లీడ్స్ వేదికగా మూడో వన్డే జరుగుతాయి.
వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో విరాట్ కొహ్లీ,శిఖర్ ధావన్,రోహిత్ శర్మ,రాహుల్,శ్రేయస్ అయ్యర్,సురేష్ రైనా,ధోనీ,దినేష్ కార్తీక్,యజ్వేంద్ర చహాల్,అక్షర్ పటేల్,కుల్దీప్ యాదవ్,భువనేశ్వర్ కుమార్,దీపక్ చహార్,హార్దిక్ పాండ్య,సిద్దార్ద్ కౌల్,ఉమేష్ యాదవ్ ఉన్నారు.


టాప్ ర్యాంక్ ఇంగ్లండ్,సెకండ్ ర్యాంకర్ ఇండియా మధ్య 3 వన్డేల సిరీస్‌లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
First published: July 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు