World T20: భారత్​లో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్​.. పాక్​ ఆటగాళ్ల వీసాలకు​ గ్రీన్​సిగ్నల్​!

pakistan team (ఫైల్ ఫోటో)

టి సమస్య లేకున్నా పాకిస్థాన్​ ఆటగాళ్ల విషయంలో మాత్రం సందిగ్ధం నెలకొంది. భారత్, పాక్​ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్​​ ఆటగాళ్లకు భారత ప్రభుత్వం వీసాలు మంజూరు చేస్తుందా? లేదా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • Share this:
అక్టోబర్​ నెలలో టీ 20 ప్రపంచ కప్​ పోటీలు జరగనున్నాయన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది టీ 2‌0 ప్రపంచకప్​ సిరీస్​కు భారత్​ ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా, ఈ ప్రపంచకప్​లో అనేక దేశాలకు చెందిన జట్లతో పాటు పాకిస్థాన్​ జట్టు కూడా పాల్గొననుంది. అయితే, టీ20కి భారత్​ వేదిక కానుండటంతో ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లకు భారత్​ వీసాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇతర అన్ని దేశాల విషయంలో ఎటువంటి సమస్య లేకున్నా పాకిస్థాన్​ ఆటగాళ్ల విషయంలో మాత్రం సందిగ్ధం నెలకొంది. భారత్, పాక్​ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్​​ ఆటగాళ్లకు భారత ప్రభుత్వం వీసాలు మంజూరు చేస్తుందా? లేదా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిర్వహిస్తున్న టీ 20 టోర్నీలో బాబర్​ అజామ్​ నేతృత్వంలోని పాకిస్థాన్​ జట్టు టోర్నీ​లో పాల్గొనాంటే భారత ప్రభుత్వం వాళ్లకు వీసాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అందుకే వీసాల మంజూరుపై తమకు కచ్చితమైన హామీ ఇవ్వాలని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు చీఫ్ ఎహసాన్​ మనీ కొంతకాలంగా కోరుతూ వస్తున్నారు. భారత ప్రభుత్వం నుంచి తమకు ఈ హామీ ఇప్పించాలని ఇంటర్నేషనల్​ క్రికెట్​ కౌన్సిల్​కు విజ్ఞప్తి చేశారు. అయితే, దీనిపై చర్చించేందుకు బీసీసీఐతో ఐఐసీ ఇటీవలే సమావేశం నిర్వహించింది.

ఈ మీటింగ్​లో పాకిస్థాన్​ ఆటగాళ్లకు వీసాల మంజూరుపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించనట్లు ఐఐసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని బిసిసిఐ కార్యదర్శి జే షా ఐసీసీ అపెక్స్ కౌన్సిల్‌కు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘అక్టోబర్​లో జరగబోయే టీ 20 ప్రపంచకప్​ పోటీలకు భారత్​ ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఈ పోటీల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్​ జట్టుకు వీసాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా సానుకూలంగా స్పందించింది. కాగా, మ్యాచ్‌లు చూడటానికి వచ్చే పాకిస్థాన్​​ అభిమానులను సరిహద్దుల మీదుగా రానివ్వాలా? లేదా? అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.”అని తెలిపారు.

టీ20కి ఆతిథ్యమివ్వనున్న భారత్​..కాగా, భారత్​, పాకిస్థాన్​​ ఇరు దేశాల మధ్య సరిహద్ధు ఉద్రిక్తతల కారణంగా చాలా సంవత్సరాలుగా ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. చాలా సంవత్సరాల తర్వాత భారత్​ పాక్​ తలపడనున్నాయి. ఈసారి జరగబోయే ఐసీసీ ట్వంటీ 20 ఫైనల్‌ మ్యాచ్​కు అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. దీనితో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాల స్టేడియాలలో మ్యాచ్​లు జరగనున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం నాలుగో టీ20లో దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండో సిరీస్​ను పాకిస్థాన్​​ కైవసం చేసుకుంది. నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన నాలుగో టీ20 ఫైనల్​ మ్యాచ్​లో ఆతిథ్య సఫారీ జట్టుపై మూడు వికెట్ల తేడాతో గెలిచిన పాక్​ 3–1తో టీ 2‌‌0 సరీస్​ను దక్కించుకుంది.
Published by:Nagesh Paina
First published: