హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India: ఇండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా రహానే.. న్యూజీలాండ్‌తో తలపడబోయే జట్టు ఇదే.. మరి కోహ్లీ పరిస్థితి ఏంటి?

Team India: ఇండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా రహానే.. న్యూజీలాండ్‌తో తలపడబోయే జట్టు ఇదే.. మరి కోహ్లీ పరిస్థితి ఏంటి?

టెస్టు జట్టు కెప్టెన్‌గా అజింక్య రహానే.. (PC: BCCI)

టెస్టు జట్టు కెప్టెన్‌గా అజింక్య రహానే.. (PC: BCCI)

Team India: న్యూజీలాండ్ జట్టు త్వరలో ఇండియాలో పర్యటించనున్నది. ఇందులో భాగంగా మూడు టీ20 మ్యాచ్‌లతో పాటు రెండు టెస్టులు ఆడనున్నది. తాజాగా జాతీయ సెలెక్టర్లు రెండు టెస్టుల బృందాన్ని ప్రకటించారు. తొలి టెస్టుకు అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఇంకా చదవండి ...

న్యూజీలాండ్ (New Zealand) క్రికెట్ జట్టు త్వరలో ఇండియాలో (India) పర్యటించనున్నది. ఇందులో భాగంగా మూడు టీ20 మ్యాచ్‌లతో (T20 Cricket) పాటు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నది. కాగా, ఇప్పటికే సీనియర్ జట్టు సెలెక్టర్లు టీ20 జట్టును ప్రకటించారు. ఆ జట్టుకు రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే టీ20 కెప్టెన్సీ నుంచి ఇప్పటికే తప్పుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) న్యూజీలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టుకు అందుబాటులో ఉండనని చెప్పాడు. విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మకు టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. తాజాగా కివీస్‌తో తలపడనున్న భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. 15 మంది ఉన్న ఈ జట్టుకు అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. చతేశ్వర్ పుజారాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే ముంబైలో జరుగనున్న రెండో టెస్టుకు కోహ్లీ అందుబాటులోకి రానున్నాడు. ఆ టెస్టులో కోహ్లీనే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఇక రిషబ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో.. ఇద్దరు వికెట్ కీపర్లను సెలెక్ట్ చేశారు. వృద్దిమాన్ సాహకు తోడుగా కేఎస్ భరత్‌ను కూడా వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు.

టీమ్ ఇండియా : అజింక్య రహానే, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజార (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్దిమాన్ సాహ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, ఎండీ. సిరాజ్, ప్రసిద్ కృష్ణ

T20 World Cup: ఇది వరల్డ్ కప్పా? గల్లీ క్రికెట్టా? అసలా బౌలింగ్ ఏంటి? వార్నర్ దాన్ని కూడా వదల్లేదుగా..!న్యూజీలాండ్ జట్టు టెస్టు షెడ్యూల్

తొలి టెస్టు - నవంబర్ 25 నుంచి 29 వరకు - కాన్పూర్

రెండో టెస్టు - డిసెంబర్ 3 నుంచి 7 వరకు - ముంబై

టీ20 సిరీస్ షెడ్యూల్

తొలి టీ20 - 17 నవంబర్ - జైపూర్

రెండో టీ20 - 19 నవంబర్ - రాంచీ

మూడో టీ20 - 21 నవంబర్ - కోల్‌కతా

First published:

Tags: India vs newzealand, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు