Home /News /sports /

INDIA SQUAD FOR ASIA CUP 2022 ANNOUNCED VIRAT KOHLI IS BACK BUT JASPRIT BUMRAH MISSED OUT ASIA CUP 2022 DUE TO INJURY SJN

Asia Cup 2022 : కింగ్ ఈజ్ బ్యాక్.. అయితే అతడి విషయంలోనే ఆందోళన.. ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా జట్టు ఇదే

Team India

Team India

Asia Cup 2022 : ఈ నెల 27 నుంచి ఆసియా కప్ (Asia Cup) క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనే భారత (India) భారత జట్టును చేతన్ శర్మ (Chetan Sharma) నాయకత్వంలోని బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్షన్ కమిటీ సోమవారం రాత్రి ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Asia Cup 2022 : ఈ నెల 27 నుంచి ఆసియా కప్ (Asia Cup) క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనే భారత (India) భారత జట్టును చేతన్ శర్మ (Chetan Sharma) నాయకత్వంలోని బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్షన్ కమిటీ సోమవారం రాత్రి ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిని టీమిండియా (Team India)ను సెలెక్షన్ కమిటీ  ప్రకటించింది. ఇంగ్లండ్ (England) పర్యటన అనంతరం క్రికెట్ కు విరామం ప్రకటించిన కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇక అదే సమయంలో ఐపీఎల్ (IPL) తర్వాత వరుసగా ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ (KL Rahul) కూడా కమ్ బ్యాక్ చేయనున్నాడు. గాయంతో బాధపడుతున్న జస్ ప్రీత్ బుమ్రా (Jasprit bumrah) ఆసియా కప్ లో చోటు దక్కించకోలేకపోయాడు.

జట్టు కూర్పు ఎలా ఉందంటే

జట్టు కూర్పు విషయానికి వస్తే 5 స్పెషలిస్టు బ్యాటర్లు.. ఇద్దరు వికెట కీపర్లు.. ఇద్దరు ఆల్ రౌండర్లు.. ముగ్గురు స్పిన్నర్లు.. ముగ్గురు పేసర్ల ఫార్ములాను బీసీసీఐ అనుసరించింది. ఒక రకంగా చెప్పాలంటే యూఈఏ పిచ్ లకు అనుగుణంగా భారత్ తన టీంను సెలెక్ట్ చేసింది. ఫామ్ తో సతమతం అవుతూ ఇంగ్లండ్ పర్యటన అనంతరం క్రికెట్ కు విరామం ప్రకటించిన విరాట్ కోహ్లీకి బీసీసీఐ మరో అవకాశం ఇచ్చింది. టి20 ప్రపంచకప్ ముంగిట జరుగుతున్న మెగా ఈవెంట్ కావడంతో ఇందులో కోహ్లీ కచ్చితంగా రాణించాల్సి ఉంది. అదే సమయంలో కేఎల్ రాహుల్ కూడా ఎట్టకేలకు మళ్లీ టీమిండియా తరఫున ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఇక రిజర్వ్ ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ లను ఎంపిక చేసింది.


భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్, యుజువేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్

రిజర్వ్ ప్లేయర్లు 

శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India VS Pakistan, Jasprit Bumrah, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు