Home /News /sports /

IND vs NZ: కాన్పూర్‌లో ప్రారంభమైన తొలి టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. అరంగేట్రం చేసిన అయ్యర్

IND vs NZ: కాన్పూర్‌లో ప్రారంభమైన తొలి టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. అరంగేట్రం చేసిన అయ్యర్

కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా (PC: BCCI)

కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా (PC: BCCI)

IND vs NZ: రెండు టెస్టు సిరీస్‌లో భాగం ఈ రోజు కాన్పూర్‌లో ఇండియా - న్యూజీలాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియాలో శ్రేయస్ అయ్యర్, కివీస్ జట్టులో రచిన్ రవీంద్ర అరంగేట్రం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఇండియా పర్యటనకు వచ్చిన న్యూజీలాండ్ క్రికెట్ జట్టు (New Zealand) ఇప్పటికే టీ20 సిరీస్ ఆడింది. ఇక నేటి నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఆడనున్నది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమ్ ఇండియా (Team India) కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాన్పూర్ వికెట్ తొలిరెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించి ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నట్లు రహానే తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేయడం వల్ల మాకు పిచ్ సహకరిస్తుందని అనుకుంటున్నట్లు రహానే అన్నాడు. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేయనున్నాడని చెప్పాడు. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) హెడ్ కోచ్‌గా ఉండటం చాలా ఆనందంగా ఉన్నది. ఇక వరల్డ్ టెస్ట్ చాంపియన్లు అయిన న్యూజీలాండ్‌ను తేలికగా తీసుకోవడం లేదు. వాళ్లు ఎలాంటి కండిషన్లలో అయినా రాణించగలరు. ఈ మ్యాచ్ గట్టిపోటీ ఇస్తారని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు రహానే తెలిపాడు.

    టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపే వాళ్లమని న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అన్నాడు. అయినా నిరాశ పడటం లేదు.. త్వరగా వికెట్లు తీయడం ద్వారా ఇండియాపై ఒత్తిడి పెంచుతామని కేన్ చెప్పాడు. ఈ మ్యాచ్ మాకు ఒక చాలెంజ్. వరల్డ్ టెస్ట్ చాంపియన్లుగా బరిలోకి దిగుతుండటంతో మాపై చాలా బాధ్యత ఉన్నది. మేము ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాము. అజాజ్ పటేల్, విల్ సోమర్‌విల్లేకు అవకాశం ఇస్తున్నాము. ఇక స్పిన్నర్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తున్నాడని కేన్ అన్నాడు.











    ఇక టీమ్ ఇండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. టీమ్ ఇండియా తరపున టెస్టు మ్యాచ్ ఆడుతున్న 303వ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. మ్యాచ్‌కు ముందు మైదానంలో జరిగిన టీమ్ మీటింగ్‌లో రాహుల్ ద్రవిడ్ ఆహ్వానం మేరకు దిగ్గజ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అతడికి బ్లూ క్యాప్ అందించి టెస్టు జట్టులోకి ఆహ్వానించాడు. క్యాప్ అందుకున్న తర్వాత శ్రేయస్ చాలా ఉద్వేగంగా కనపడ్డాడు. క్యాప్‌ను ముద్దుపెట్టుకొని తలకు ధరించాడు. అనంతరం జట్టు సభ్యులు అతడికి శుభాకాంక్షలు తెలిపారు.
    Published by:John Kora
    First published:

    Tags: India vs newzealand, Kane Williamson, Rahul dravid, Shreyas Iyer, Team india, Test Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు