మూడో టెస్ట్, డే-2: భారత్ 329 ఆలౌట్

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. కోహ్లి, రహానే మినహా జట్టులో మిగతా బ్యాట్స్‌మెన్ అంతగా రాణించలేదు.

news18-telugu
Updated: August 19, 2018, 5:26 PM IST
మూడో టెస్ట్, డే-2: భారత్ 329 ఆలౌట్
ప్రతీకాత్మక చిత్రం..
  • Share this:
ట్రెంట్ బిడ్జ్ వేదికగా ఇంగ్లాండుతో జరుగుతున్న మూడో టెస్టులో.. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 329 పరుగులకు ఆలౌట్ అయింది. 307/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. వెంట వెంటనే మిగతా వికెట్లను కోల్పోయింది. మొదటి రోజు ఆటలో క్రిస్ ఓక్స్ భారత టాప్ ఆర్డర్‌ను కుప్ప కూల్చగా.. రెండో రోజు బ్రాడ్, జేమ్స్ అండర్సన్ టైలండర్స్‌ను ఔట్ చేశారు. కోహ్లి-రహానే తర్వాత.. ఆపై వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దీంతో రెండో రోజు లంచ్ విరామానికి ముందే భారత్ ప్యాకప్ చెప్పక తప్పలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓక్స్, బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.. చెరో మూడు వికెట్లు తీశారు. అదిల్ రషీద్‌కి ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 16/0 స్కోరుతో తన మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది.

ఇది కూడా చదవండి: మూడో టెస్ట్, డే-1: భారత్ 307/6
Published by: Srinivas Mittapalli
First published: August 19, 2018, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading