ICC WORLD CUP 2019 | వరల్డ్ కప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్...చేతిగాయంతో టోర్నీ నుంచి దూరం...

shikhar dhawan | టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడు. తొలుత మూడు మ్యాచులకు దూరమంటూ వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం మొత్తం టోర్నీ నుంచే ధావన్ దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. ధావన్ స్థానంలో రిషబ్ పంత్ టీమిండియాకు అందుబాటులోకి రానున్నాడు.

news18-telugu
Updated: June 19, 2019, 5:18 PM IST
ICC WORLD CUP 2019 | వరల్డ్ కప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్...చేతిగాయంతో టోర్నీ నుంచి దూరం...
ధవన్ (ఫైల్)
news18-telugu
Updated: June 19, 2019, 5:18 PM IST
shikhar dhawan | ఎడమ చేతి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడు. తొలుత మూడు మ్యాచులకు దూరమంటూ వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం మొత్తం టోర్నీ నుంచే ధావన్ దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. ధావన్ స్థానంలో రిషబ్ పంత్ టీమిండియాకు 15 మంది బృంద సభ్యుల్లో చోటు దక్కించుకోనున్నాడు. ఈ మేరకు టీమ్ మేనేజర్ సునీల్ సుబ్రహ్మణం ఒక ప్రకటనలో తెలిపాడు. ఇదిలా ఉంటే ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధావన్ ఆడలేదు. ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ అవతారం ఎత్తాడు. ముందు ధావన్ మూడు మ్యాచుల( పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, వెస్టిండీస్)కు దూరంగా ఉంటాడని టీమిండియా ప్రకటించింది. అయితే గాయం తగ్గే పరిస్థితి కనపడకపోవడంతో శిఖర్ ధావన్ వరల్డ్‌కప్ నుంచి దూరం కావాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే జూన్ 5, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఎడమ చేతి బొటన వేలికి గాయం అయ్యింది. స్కానింగ్ చేయగా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి, విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే ఈ నెల 30న ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ లో ధావన్ ఆడతాడని అంతా భావించారు. కానీ తాజాగా ధావన్ గాయంపై వైద్య పరీక్షలు నిర్వహించగా ఇప్పట్లో తగ్గి పూర్తి ఫిట్ నెస్ తో మైదానంలోకి దిగే అవకాశం లేదని బీసీసీఐ వైద్యులు పేర్కొన్నారు.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...