ఇంగ్లండ్ టూర్‌లో విరాట్ సేన నెగ్గింది నాలుగు మ్యాచ్‌లే!!

ఇంగ్లండ్ టూర్‌లో ట్వంటీ ట్వంటీ,వన్డే టెస్ట్ సిరీస్‌ల్లో కలిపి 11 మ్యాచ్‌లు ఆడి టీమిండియా నాలుగు విజయాలే సాధించగలిగింది.

news18-telugu
Updated: September 12, 2018, 3:30 PM IST
ఇంగ్లండ్ టూర్‌లో విరాట్ సేన నెగ్గింది నాలుగు మ్యాచ్‌లే!!
భారత జట్టు కోచ్ రవిశాస్త్రి,కెప్టెన్ విరాట్ కొహ్లీ (BCCI/Twitter)
news18-telugu
Updated: September 12, 2018, 3:30 PM IST
టీమిండియా ఇంగ్లండ్‌ టూర్‌లో అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. టెస్ట్, వన్డే సిరీస్‌ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయిన కొహ్లీ సేన...టీ20 సిరీస్ మాత్రమే చేజిక్కించుకోగలిగింది.మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌లు ఆడిన భారత జట్టు ట్వంటీ ట్వంటీ సిరీస్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. మూడు మ్యాచ్‌ల ట్వంటీ ట్వంటీ,వన్డే సిరీస్‌లు, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల్లో కలిపి 11 మ్యాచ్‌లు ఆడి విరాట్ కొహ్లీ అండ్ కో నాలుగు విజయాలే సాధించగలిగింది. టీ20 సిరీస్‌ను 2-1తో నెగ్గి ఇంగ్లండ్‌ టూర్‌లో శుభారంభం చేసింది.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌‌ను ప్రతిష్టాత్మకంగా భావించిన భారత్...ఒకే ఒక్క విజయం నమోదు చేయగలిగింది.

ఇండియా-ఇంగ్లండ్ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఫలితాలు:

ఆ తర్వాత వన్డే, టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు బోల్తా పడింది.సునాయాసంగా నెగ్గాల్సిన వన్డే సిరీస్‌ను 1-2తో చేజార్చుకుంది.విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఓ వన్డే సిరీస్ ఓడిపోవడం ఇదే తొలి సారి.

ఇండియా-ఇంగ్లండ్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఫలితాలు:

  • నాటింగ్‌హామ్ వన్డేలో భారత జట్టు 8 వికెట్లతో నెగ్గింది.

  • లార్డ్స్ వన్డేలో 86 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్ సమం చేసింది.

  • లీడ్స్ వన్డేలో ఇంగ్లండ్ 8 వికెట్లతో సంచలన విజయం సాధించి సిరీస్ విజేతగా నిలిచింది.


1-4తో టెస్ట్ సిరీస్ కోల్పోయి విరాట్ సేన విమర్శలు ఎదుర్కొంటోంది.ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్రను తిరగరాస్తుందనుకుంటే...ఘోర వైఫల్యంతో అప్రతిష్ట మూట గట్టుకుంది.

ఇండియా-ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల టెస్ట్‌‌ సిరీస్ ఫలితాలు:

  • ఎడ్జ్ బాస్టన్ టెస్ట్‌లో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో నెగ్గింది.

  • లండన్ టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో నెగ్గింది.

  • ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్‌లో ఇండియా 203 పరుగుల భారీ తేడా విజయం సాధించింది.

  • సౌతాంప్టన్ టెస్ట్‌లో 60 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

  • ఓవల్ టెస్ట్‌లో ఇంగ్లండ్ 118 పరుగుల తేడాతో విజయం సాధించి 4-1తో సిరీస్‌ సొంతం చేసుకుంది.


మూడు నెలల పాటు సాగిన ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఒక్క సిరీస్ విజయంతోనే స్వదేశానికి చేరుకుంది.వన్డే సిరీస్ ఓటమి భారత్‌ను పెద్దగా బాధించకున్నా...టెస్ట్‌ల్లో నెంబర్ వన్ జట్టుగా ఉండి నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టును ఓడించలేకపోవడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇంగ్లండ్ పర్యటన విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టుకు పెద్ద గుణపాఠం అనడంలో అనుమానమే లేదు.

ఇవీ చదవండి:


ఇంగ్లండ్‌‌‌‌‌లో మరో సిరీస్ మిస్ చేసుకున్న ఇండియా


ఇంగ్లండ్‌లో 'టెస్ట్' పాస్ కాలేకపోయిన టీమిండియా

First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...