క్రీడలు

  • associate partner

క్రికెట్ ఫ్యాన్స్‌కు మరో ట్రీట్.. ఐపీఎల్‌కు ముందే..

ఐపీఎల్ కంటే ముందే ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడు టి20 మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.

news18-telugu
Updated: July 22, 2020, 11:48 AM IST
క్రికెట్ ఫ్యాన్స్‌కు మరో ట్రీట్.. ఐపీఎల్‌కు ముందే..
విరాట్ కొహ్లి (ఫైల్ ఫోటో)
  • Share this:
టి20 ప్రపంచకప్ రద్దు కావడంతో సెప్టెంబర్‌లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇండియాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో... యూఏఈలో ఈసారి ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం అనుమతి ఇవ్వాలంటూ కేంద్రాన్ని అభ్యర్థించింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెంటనే... ఐపీఎల్ నిర్వహణ ప్రక్రియను మొదలుపెట్టాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఐపీఎల్ కంటే ముందే ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడు టి20 మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. స్టార్ గ్రూప్‌తో కలిసి ఈ మేరకు బీసీసీఐ చర్చలు జరుపుతోంది.

ఈ సిరీస్‌ను బట్టి ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఖాళీ స్టేడియాల్లోనే ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే యోచనలో బీసీసీఐ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే దుబాయ్, అబుదాబీ, షార్జా వేదికల్లో ఈసారి ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: July 22, 2020, 11:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading