Home /News /sports /

INDIA LOSE TOP SPOT IN ICC TEST RANKINGS TO AUSTRALIA BA

42 నెలల ఆధిపత్యానికి తెర... టీమిండియా చేజారిన నెంబర్ వన్ ర్యాంక్

COVID scare for BCCI as Team India's throwdown specialist tests positive, will miss Australia tour

COVID scare for BCCI as Team India's throwdown specialist tests positive, will miss Australia tour

ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది.

    భారత క్రికెట్ జట్టు నెంబర్ వన్ ర్యాంక్ నుంచి దిగజారింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. సుమారు 42 నెలల పాటు చార్ట్‌లో నెంబర్ వన్‌గా కొనసాగిన భారత్ ఇప్పుడు ఏకంగా మూడో స్థానంలోకి వచ్చింది. 116 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, , 115 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాత భారత్ (114 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచింది. 2016 - 17 సీజన్‌లో భారత జట్టు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని చేరుకుంది. ఆ ఏడాది 12 టెస్టులు గెలిచి, ఒక టెస్టులో మాత్రమే టీమిండియా ఓడింది. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లను కూడా గెలుచుకుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చెందింది. తాజాగా వచ్చిన ర్యాంకింగ్స్‌తో ఆస్ట్రేలియా మళ్లీ ఫస్ట్ ప్లేస్‌కు వచ్చింది.

    ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఎక్కువ నెలల పాటు నెంబర్ వన్‌గా ఉన్న జట్లు
    ఆస్ట్రేలియా (2001-2009) - 95
    వెస్టిండీస్ (1981-1988) - 89
    ఆస్ట్రేలియా (1959-1963) - 60
    వెస్టిండీస్ (1964-1968) - 60
    ఆస్ట్రేలియా (1995-1999) - 44
    ఆస్ట్రేలియా (1974-1978) - 43
    భారత్ (2016-2020) - 42
    ఆస్ట్రేలియా (1952-1955) - 41
    ఇంగ్లండ్ (1970-1973) - 37
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Cricket, ICC, ICC Test Rankings

    తదుపరి వార్తలు