ఐపీఎల్ నిర్వహణపై గుడ్‌న్యూస్ చెప్పిన గంగూలీ

సాధ్యమైనంత వరకు భారత్‌లోనే ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. ఒక్కవేళ భారత్‌లో పరిస్థితులు అనకూలించకపోతే లీగ్‌ను విదేశాలలో నిర్వహించే ఆలోచనలో బోర్డు ఉంది.


Updated: July 9, 2020, 2:14 PM IST
ఐపీఎల్ నిర్వహణపై గుడ్‌న్యూస్ చెప్పిన గంగూలీ
ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే... బీసీసీఐ రూ. 2500 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ వ్యాఖ్యానించారు.
  • Share this:
క్రికెట్ అభిమానులు ఎప్పుడు.. ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ త్వరలోనే ప్రారంభమయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తాజాగా గంగూలీ చేసిన వ్యాఖ్యలే బలాన్ని చేకూర్చాయి. ఐపీఎల్‌ నిర్వహించడమే ఇప్పుడు తనకున్న మెుదటి కర్తవ్వమన్నారు. ఐపీఎల్ లేకుండా  ఈ ఏడాది ముగిసిపోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా లీగ్ నిర్వహిస్తామన్నారు.

ఐపీఎల్ నిర్వహించాలని గంగూలీ గట్టి పట్టుదలతో ఉండడంతో అభిమానులలో ఆశలు చిగురించాయి. 2020 ఐపీఎల్ లేకుండానే ముగుస్తోందా.. అనుకున్నప్పటికి దాదా వాఖ్యలతో ఈవెంట్ జరుతుందనే నమ్మకం అభిమానుల్లో పెరిగింది. ఐసీసీ టి20 వరల్డ్‌కప్‌ భవితవ్యాన్ని బట్టి ఐపీఎల్ తేదిలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజా పరిణామాలను చూస్తే టి20 వరల్డ్‌కప్‌ జరగడం కష్టమే అనిపిస్తోంది.

కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గకపోవడంతో వరల్డ్‌కప్‌‌ను ఐసీసీ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సాధ్యమైనంత వరకు భారత్‌లోనే ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. ఒక్కవేళ భారత్‌లో పరిస్థితులు అనకూలించకపోతే లీగ్‌ను విదేశాలలో నిర్వహించే ఆలోచనలో బోర్డు ఉంది. ఇండియాలో ఐపీఎల్‌ నిర్వహించడమే తనకు మొట్టమొదటి ప్రాధాన్యతాంశమని గంగూలీ తాజాగా ఔపేర్కొన్నారు. దీంతో ఈ మెగా ఈవెంట్ భారత్‌లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడనేది మాత్రం స్పష్టత లేదు.
Published by: Vijay Bhaskar Harijana
First published: July 9, 2020, 2:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading