రాంచీ: టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ శుభారంభాన్ని అందించారు.
రాహుల్ 49 బంతుల్లో 65 పరుగులు, రోహిత్ శర్మ 36 బంతుల్లో 55 పరుగులతో రాణించడంతో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయే సమయానికి 117 పరుగులు చేసింది. 117 పరుగుల వద్ద టిమ్ సౌథీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్‌గా చిక్కి రాహుల్ ఔటయ్యాడు. 135 పరుగుల వద్ద రోహిత్ శర్మ సౌథీ బౌలింగ్‌లోనే గుప్తిల్‌కు క్యాచ్‌గా చిక్కడంతో పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ కూడా సౌథీ బౌలింగ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే.. ఆ తర్వాత రిషబ్ పంత్(12 పరుగులు), వెంకటేష్ అయ్యర్(12) పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.
దీంతో.. టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 17.2 ఓవర్లలోనే 155 పరుగులు చేసి టార్గెట్‌ను ఛేదించింది. ఈ గెలుపుతో టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 ఆధిక్యంతో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. 3 మ్యాచ్‌ల సిరీస్ 2-0తో భారత్ వశమైంది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీకి మూడు వికెట్లు దక్కాయి. టీమిండియా బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు, భువనేశ్వర్, దీపక్ చాహర్, అక్సర్, అశ్విన్ తలో వికెట్ తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs nz t20 series, India vs newzealand, Newzealand, Team India