• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA CRICKETERS TOOK A BREAK FROM ON FIELD ACTION SHIKHAR DHAWAN SHARES VIDEO OF ROHIT SHARMA RISHABH PANT AND KULDEEP YADAV HAVING A BLAST IN KIDS ZONE SRD

Viral Video : వీళ్ల కన్నా చిన్న పిల్లలే బెటర్..అల్లరి అల్లరి చేసిన రోహిత్, పంత్, ధావన్...

Viral Video : వీళ్ల కన్నా చిన్న పిల్లలే బెటర్..అల్లరి అల్లరి చేసిన రోహిత్, పంత్, ధావన్...

వీళ్ల కన్నా చిన్న పిల్లలే బెటర్..అల్లరి అల్లరి చేసిన రోహిత్, పంత్, ధావన్...(Photo Credit : Instagram)

Viral Video : టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది కోహ్లీసేన. దీంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు టీమిండియా క్రికెటర్లు. ఇంగ్లండ్ పై విక్టరీని వినూత్న రీతిలో ఎంజాయ్ చేస్తున్నారు.

  • Share this:
    టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది కోహ్లీసేన. దీంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు టీమిండియా క్రికెటర్లు. ఇంగ్లండ్ పై విక్టరీని వినూత్న రీతిలో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న ఆటగాళ్లంతా చిన్న పిల్లల్లా మారిపోయారు. కిడ్స్ జోన్ లోకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. టీ20 సిరీస్ కోసం టీమ్‌తో కలిసిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. ఈ వీడియోలో ఇంగ్లండ్ పై విజయం తర్వాత ఎంత జోష్‌లో ఉన్నారో అర్థమవుతుంది. అందులో ధావన్‌తోపాటు రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌, కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు. పిల్లలు ఆడుకునే జోన్‌లోకి వెళ్లి అక్కడి మూడు చక్రాల సైకిల్‌పై తిరుగుతూ, బాల్స్‌తో ఒకరినికొరు కొట్టుకుంటూ సరదాగా గడిపారు. జీవితంలో ఎంత పెద్దగా అయినా చిన్నతనం మాత్రం పోకూడదు. పని ఎంత ముఖ్యమైనా కూడా ఇలాంటి మస్తీ కూడా అవసరమే అని ధావన్ ఆ వీడియోకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ పిల్లలు చేస్తున్న మస్తీని నేను రూమ్‌లో నుంచి చూశాను అంటూ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కామెంట్ చేయడం విశేషం.

    ఇక చివరి టెస్ట్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలింది. కేవలం 54.5 ఓవర్లలోనే ఆ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డాన్‌ లారెన్స్‌ (95 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా అంతా విఫలయ్యారు. అశ్విన్‌ (5/47), అక్షర్‌ పటేల్‌ (5/48) పోటీ పడి ఐదేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'.... పంత్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' పురస్కారాలు లభించాయి.



    ఈ గెలుపుతో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధించి న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. జూన్‌ 18 నుంచి 22 వరకు లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ నిర్వహిస్తారు. భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఈ నెల 12 నుంచి అహ్మదాబాద్‌లోనే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా..పొట్టి ఫార్మాట్ లోనూ దుమ్ము రేపాలని భావిస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published: