ఓటు వేయలేకపోతున్న విరాట్ కోహ్లీ... ఎక్కడ తేడా వచ్చిందంటే...

Virat Kohli : అందరూ ఓటు వెయ్యాలని చెప్పే చాలా మంది సెలబ్రిటీలు... పోలింగ్‌కి దూరమవుతున్నారు. ఆ లిస్టులో విరాట్ కోహ్లీ కూడా చేరాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 28, 2019, 9:54 AM IST
ఓటు వేయలేకపోతున్న విరాట్ కోహ్లీ... ఎక్కడ తేడా వచ్చిందంటే...
విరాట్ కోహ్లీ
  • Share this:
టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అతను ఏం చెప్పినా... అది యూత్‌లోకి దూసుకెళ్తుంది. అందుకే ఓటు వెయ్యాలని విరాట్ అందరికీ చెప్పాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దానిపై విరాట్ కోహ్లీ సైతం పాజిటివ్‌గా స్పందించాడు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరాడు. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉంది. ఐతే... ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం ఈ టీంఇండియా కెప్టెన్ ఓటు వేసే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇంకా ఓటర్ ఐడీ కార్డు కోసం అప్లై చేసుకోలేదు. అందుకు గడువు ఆల్రెడీ అయిపోయింది. మైదానంలో సిక్సర్లతో విరుచుకపడే విరాట్... ఓటు విషయంలో మాత్రం ఔట్ అయ్యాడా.

ఢిల్లీకి చెందిన కోహ్లీ ప్రస్తుతం భార్య అనుష్కా శర్మతో ముంబైలో ఉంటున్నాడు. దాదాపు స్థిర నివాసం కింద లెక్క. అనుష్కా శర్మ ఆల్రెడీ ముంబైలో ఓటరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐడీ కార్డు వచ్చింది. కోహ్లీ కూడా అక్కడే ఓటు వెయ్యాలనుకున్నాడు. ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేయించుకునేందుకు ఆన్‌లైన్‌లో అప్లై చెయ్యాలనుకున్నాడు. ఇంతలో ఐపీఎల్ హడావుడి ఎక్కువైంది. తన జట్టు మాటిమాటికీ ఫెయిలవుతుంటే... దృష్టంతా ఆటమీద పెట్టాడు. ఆన్‌లైన్‌లో అప్లై చెయ్యలేదు. దాంతో టైమ్ అయిపోయింది. ఫలితంగా ఈ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ మిస్ అయ్యాడు.

గడువు పూర్తయ్యాక విరాట్ కోహ్లీ నుంచీ అప్లికేషన్ వచ్చిందట. టైమైపోయిందన్న ఉద్దేశంతో అధికారులు ఆ అప్లికేషన్‌ను పక్కన పెట్టారు. సో, ఈసారికి విరాట్ కోహ్లీకి ఓటు లేనట్లే. మరో ఐదేళ్లపాటూ వెయిట్ చెయ్యాల్సిందే. ఐదేళ్ల తర్వాత మాత్రం మహారాష్ట్రలోని వర్లీ నుంచీ... విరాట్ ఓటు వేయనున్నాడు. ఎంత ఆటపై శ్రద్ధ ఎక్కువైతే మాత్రం... అత్యంత ముఖ్యమైన ఓటు విషయంలో నిర్లక్ష్యం చూపిస్తే ఎలా చెప్పు అంటూ... నెటిజన్లు విరాట్‌పై ఒకింత సీరియస్ అవుతున్నారు.

 

ఇవి కూడా చదవండి :

తీవ్ర తుపానుగా ఫణి... 30న దక్షిణ కోసావైపు రాక... అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం...

అహింసా మీట్.. ఇక ల్యాబ్‌లో మాంసం తయారీ... కోళ్లు, మేకలతో పనిలేదు... టేస్ట్ ఎలా ఉంటుందంటే...ఏపీలో పెరిగిన పోలింగ్ వైసీపీకి కలిసొస్తుందా... టీడీపీకి మేలు చేస్తుందా...

మే 26న జగన్ ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తారా... ఆ రోజే మంచిదంటున్న జ్యోతిష్యులు... ఎందుకంటే...

వైసీపీ, టీడీపీ... ఏపీలో ఎవరు గెలిచినా అప్పుల తిప్పలే... సీఎం సీటు ముళ్ల కిరీటమే... బిల్లుల భారమే
First published: April 28, 2019, 9:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading