టెస్టు క్రికెట్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న కోహ్లీ

తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ను వెనక్కి నెట్టి కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.

news18-telugu
Updated: December 4, 2019, 10:25 PM IST
టెస్టు క్రికెట్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న కోహ్లీ
విరాట్ కోహ్లీ (ఫైల్ చిత్రం)
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో ఈ సారి కూడా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ను వెనక్కి నెట్టి కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఇటీవల సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన టెస్టుల్లో కోహ్లీ ఓ డబుల్ సెంచరీ తోపాటు మరో సెంచరీతో రాణించాడు. దీంతో స్మిత్ 923 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. దీంతో కోహ్లీ 928 పాయింట్లతో మళ్లీ తన మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వీరి తర్వాత 877 పాయింట్లతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక, భారత్ నుంచి టాప్10లో చటేశ్వర పుజారా నాలుగో స్థానంలో ఉండగా.. రహానె ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇటీవల పాకిస్థాన్ పై త్రిబుల్ సెంచరీతో డేవిడ్ వార్నర్ ఐదొవ స్థానానికి ఎగబాకాడు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>