విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం...దశాబ్దపు మేటి కెప్టెన్‌గా ఎంపిక

దశాబ్దపు టెస్టు, వన్డే జట్లకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. క్రిక్‌బజ్ ప్రకటించిన రెండు జట్లకు కూడా కోహ్లినే కెప్టెన్‌గా ఎంపిక కావడం విశేషం. ఓ భారత క్రికెటర్‌కు ఇలాంటి గౌరవం లభించడం ఇదే తొలిసారి.

news18-telugu
Updated: December 31, 2019, 11:15 PM IST
విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం...దశాబ్దపు మేటి కెప్టెన్‌గా ఎంపిక
(Image: BCCI/Twitter)
  • Share this:
టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ క్రికెట్ వార్త సంస్థ క్రిక్‌బజ్ ఎంపిక చేసిన దశాబ్దపు టెస్టు, వన్డే జట్లకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. క్రిక్‌బజ్ ప్రకటించిన రెండు జట్లకు కూడా కోహ్లినే కెప్టెన్‌గా ఎంపిక కావడం విశేషం. ఓ భారత క్రికెటర్‌కు ఇలాంటి గౌరవం లభించడం ఇదే తొలిసారి. ఇక, వన్డే జట్టులో ఓపెనర్‌గా రోహిత్ శర్మకు చోటు దక్కింది. మరో ఓపెనర్‌గా దక్షిణాఫ్రికా స్టార్ హాషిం ఆమ్లాకు ఛాన్స్ లభించింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లిని ఎంపిక చేశారు. జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైక కోహ్లి మూడో నంబర్‌లో సరైన ఆటగాడని క్రిక్‌బజ్ పేర్కొంది. రాస్ టైలర్, ఎబి.డివిలియర్స్, షకిబ్ అల్ హసన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్)లకు చోటు దక్కింది. బౌలింగ్ విభాగంలో మిఛెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, ఇమ్రాన్ తాహిర్‌లకు చోటు దక్కింది. పాకిస్థాన్, వెస్టిండీస్‌ల నుంచి ఎవరికీ ఛాన్స్ దొరకక పోవడం విశేషం. మరోవైపు టెస్టు జట్టు కెప్టెన్‌గా కూడా కోహ్లిని ఎంపిక చేశారు.

First published: December 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు