Home /News /sports /

INDIA CANT COMPETE WITH PAKISTAN THATS WHY DONT PLAY WITH US SAYS ABDUL RAZZAQ JNK

Abdul Razzaq: పాకిస్తాన్ క్రికెటర్ల టాలెంట్ ముందు టీమ్ ఇండియా పనికి రాదు.. మాతో ఆడకపోవడమే బెటర్..

పాకిస్తాన్ జట్టుతో టీమ్ ఇండియా ఆడకపోవడమే బెటర్ (PC: Twitter)

పాకిస్తాన్ జట్టుతో టీమ్ ఇండియా ఆడకపోవడమే బెటర్ (PC: Twitter)

Abdul Razzaq: పాకిస్తాన్ క్రికెటర్ల దగ్గర ఉన్న టాలెంట్ టీమ్ ఇండియా ఆటగాళ్ళ దగ్గర లేదని మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అంటున్నాడు. భారత జట్టు ఒత్తిడికి తట్టుకోలేదని.. పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా క్రికెట్ ఆడకపోవడమే మంచిదని విచిత్రమైన సలహా ఇస్తున్నాడు.

ఇంకా చదవండి ...
    ఇండియా (India) - పాకిస్తాన్ (Pakistan) మధ్య మరో రెండు వారాల్లో ఐసీసీ (ICC) టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఇరు దేశాల ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నది. ఆ క్రేజీ మ్యాచ్‌ను చూడటానికి ఎంతో మంది ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ ఇండియా ఆడకపోవడమే మంచిదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ (Abdul Razzaq) విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ ఇండియా అంత బలమైన జట్టేమీ కాదని రజాక్ అన్నాడు. ప్రస్తుతం పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ ఆడకపోతేనే పరువు దక్కుతుందని చెప్పాడు. ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. ఓడిపోతామని ఎవరూ మ్యాచ్ ఆడకుండా తప్పించుకోరు. కానీ అబ్దుల్ రజాక్ ఇలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుండటంతో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. అందుకే కావాలనే రజాక్ ఇలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నాడు.

    'ఇండియా ఈ టైంలో పాకిస్తాన్‌తో తలపడలేదు. పాకిస్తాన్ జట్టులో ఉన్న టాలెంట్ చాలా డిఫరెంట్. ఇలాంటి ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఇండియా టీమ్‌లో అసలు లేరు. ఇండియా - పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరిగి ఉంటే బాగుండేది. అప్పుడు టీమ్ ఇండియా అలవాటు పడేది. కానీ ఇప్పుడు పాకిస్తాన్‌తో ఆడటం చాలా కష్టం' అని అబ్దుల్ రజాక్ అన్నాడు. గత కొన్నేళ్లుగా ఇండియా తయారు చేసిన క్రికెటర్ల కంటే ఎక్కువ నాణ్యత కలిగిన క్రికెటర్లు పాకిస్తాన్‌లోనే ఉన్నారని చెప్పాడు.

    IPL 2021: కృష్ణప్పా.. ఎంత పని చేసినావప్పా.. క్యాచ్ వదిలేయడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోలింగ్




    ఇండియా మహా అంటే సునిల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, జస్ప్రిత్ బుమ్రా వంటి వారిని తయారు చేసింది. కానీ వీళ్లందరూ కలసినా పాకిస్తాన్ టాలెంట్ ముందు చాలా తక్కువే అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇండియా తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేదని మ్యాచ్‌లు ఓడిపోతుంటుందని రజాక్ అన్నాడు. అందుకే రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో తలపడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

    IPL 2021 - Play Offs: ఉన్నది ఒకే ఒక స్థానం.. 4 జట్ల పోటీ.. అగ్రస్థానం కోసం మూడు జట్ల పోరాటం.. ఎవరికి దక్కేనో?


    అయితే ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా రికార్డు చూస్తే ఎవరు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారో అర్దం అవుతుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో భారత్‌ చేతిలో పాకిస్తాన్ 14 సార్లు ఓడిపోయింది. వరల్డ్ కప్‌లలో ఒక్కసారి కూడా టీమ్ ఇండియాపై పాకిస్తాన్ గెలవలేదు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఒత్తిడిని జయించి మరీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి కప్పు కొట్టింది. ఇన్ని రికార్డులు ఉన్నా.. రజాక్ అలా వ్యాఖ్యలు చేయడం అందరికీ నవ్వు తెప్పిస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: ICC, India VS Pakistan, T20 World Cup 2021, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు