ప్రపంచ క్రికెట్‌లో ఐదారేళ్లు మనదే ఆధిపత్యం: అనిల్ కుంబ్లే

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ విజయాన్ని ముందే అంచనావేయగలిగినట్లు చెప్పిన అనిల్ కుంబ్లే...డేవిడ్ వార్నర్, స్మిత్ జట్టులో లేని లోటును భర్తీ చేసుకోవడంలో ఆస్ట్రేలియా విఫలం చెందిందని విశ్లేషించారు.

news18-telugu
Updated: January 8, 2019, 3:32 PM IST
ప్రపంచ క్రికెట్‌లో ఐదారేళ్లు మనదే ఆధిపత్యం: అనిల్ కుంబ్లే
అనిల్ కుంబ్లే ( Twitter image)
  • Share this:
ప్రపంచ క్రికెట్‌లో మరో ఐదారేళ్ల పాటు భారత జట్టు ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని భారత జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు తొలిసారిగా టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడంపై కుంబ్లే స్పందించారు. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంటుందని తాను ముందే అంచనావేయగలిగినట్లు ‘క్రికెట్ నెక్ట్స్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులో లేకపోవడతో ఆస్ట్రేలియా బలహీనంగా ఉందని, అందుకే టీమిండియా గెలుస్తుందని భావించినట్లు వివరించారు. అదే సమయంలో ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని అభినందించారు. ప్రధానంగా ఫాస్ట్ బౌలింగ్‌లో ఆసీస్‌పై భారత జట్టు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిందని వివరించారు. పుజారా బ్యాటింగ్‌లో అద్భుతమైన ఆటతీరుతో మెప్పించాడని కొనియాడారు.

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపైనే ఓడించడం గొప్ప విషయమని కుంబ్లే పేర్కొన్నారు. ఆసీస్ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుగా ప్రస్తుత భారత జట్టు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులో లేనందునే ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయిందంటూ భారత జట్టు విజయాన్ని తక్కువ చేయడం సరికాదన్నారు. అయితే ఇద్దరు మేటి బ్యాట్స్‌మన్లు జట్టులో లేకపోవడంతో ఆస్ట్రేలియాకు నష్టం చేకూర్చేదేనని అన్నారు. ఆస్ట్రేలియా తరఫున గత రెండేళ్లలో నమోదైన మొత్తం పరుగుల్లో...50 శాతం పరుగులు వీరిద్దరే చేశారని గుర్తుచేశారు. క్రికెట్‌కు మంచి చేసేందుకే వారిద్దరిని నిషేధించారని, అయితే వారు ఆసీస్ జట్టులో లేని లోటును భర్తీ చేసుకోలేక పోయారని అభిప్రాయపడ్డారు.
First published: January 8, 2019, 3:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading