news18-telugu
Updated: August 19, 2018, 11:03 PM IST
హార్థిక్ పాండ్యా..(File)
నాటింగ్‌హామ్ ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండుతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టు బిగించే దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లాండును కేవలం 161 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో పాండ్యా 5 వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్ప కూల్చాడు. ఇషాంత్, బమ్రా చెరో వికెట్ తీయగా.. షమీ 1 వికెట్ తీశాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో బట్లర్ చేసిన 39 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.
స్వల్ప స్కోరుకే ఇంగ్లాండును కట్టడి చేయడంతో భారత్‌కు 168 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేశాక.. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. అయితే స్టోక్స్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్ బౌల్డ్ అవడంతో 60 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి ధవన్‌తో ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రషీద్ బౌలింగ్‌లో ధవన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో 111 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 113/2 కాగా.. చటేశ్వర్ పుజారా(29), కోహ్లి(1) క్రీజులో ఉన్నారు.
Published by:
Srinivas Mittapalli
First published:
August 19, 2018, 10:54 PM IST