టీమిండియా అరుదైన రికార్డు.. ఆ విజయాల అన్నింటిలోనూ కోహ్లీయే కెప్టెన్

virat kohli (1)

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ అన్నింటిలోనూ భారత్ విజయం సాధించింది. వీటిలో ఇంగ్లాండ్‌లో ఓ సిరీస్ జరగగా.. ఇండియాలో రెండు టీ20 సిరీస్‌లు జరిగాయి

 • Share this:
  ఇంగ్లాండ్,భారత్ మధ్య జరిగిన టీ20 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఒక అరుదైన రికార్డు సాధించింది. 2016 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఇప్పటివరకు ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ అన్నింటిలోనూ భారత్ విజయం సాధించింది. వీటిలో ఇంగ్లాండ్‌లో ఓ సిరీస్ జరగగా.. ఇండియాలో రెండు టీ20 సిరీస్‌లు జరిగాయి. 2017 భారత్ వేదికగా జరిగిన మూడు టీ20 సిరీస్‌లో ఇండియా 2-1 తేడాతో గెలుపోదింది. 2018లో ఇంగ్లండ్‌లో జరిగిన మూడు టీ20 సిరీస్‌లో భారత్ 2-1తో నెగ్గింది.
  తాజాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 3-2 తేడాతో గెలుచుకొని రికార్డు నెలకొల్పింది. అయితే ఈ మూడు టీ20 సిరీస్‌లకు విరాట్ కోహ్లీయే కెప్టెన్‌గా ఉండడం మరో విశేషం.  శనివారం జరిగిన ఫైనల్ టీ20 మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 225 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ బాట్స్‌మెన్స్ ఛేదించలేకపోయారు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్‌ తన తొలి ఓవర్‌లోనే రెండో బంతికే రాయ్‌ను ఔట్‌ చేశాడు. 5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి ఇంగ్లాండ్ 55 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇన్ని్ంగ్స్‌ను మలన్,బట్లర్ దిగ్విజయంగా ముందుకు తీసుకేళ్ళారు. 10 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 104/1 సాధించింది. వీరిద్దరూ రన్‌రేట్‌ పెరగకుండా షాట్లు బాదేశారు. ఆ తర్వాత టీమ్‌ఇండియాకు ఎట్టకేలకు బ్రేక్‌ లభించింది. దూకుడుగా ఆడుతున్న జోస్‌ బట్లర్‌ (52; 34 బంతుల్లో 2×4, 4×6) ఔటయ్యాడు. భువీ వేసిన 12.5వ బంతికి అతడు భారీ షాట్‌ ఆడబోయి హార్దిక్‌ పాండ్య చేతికి చిక్కాడు.

  తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లో కీలక వికెట్ బెయిర్‌స్టో 7(7) ఔటయ్యాడు. తర్వాత మోర్గాన్‌ క్రీజులోకి వచ్చాడు. శార్దూల్‌‌ ఠాకూర్‌ మరోసారి మాయ చేశాడు. గత మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన శార్దూల్‌.. ఈ మ్యాచ్లోనూ ఓకే ఓవర్‌లో ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి బంతికి మలన్‌ 68(46) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

  మోర్గాన్‌ (1)ని హార్దిక్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత రన్‌రేట్‌ పెరగడపోవడంతో మిగితా బ్యాట్స్‌మెన్స్ సందిగ్ధంలో పడ్డారు.భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 3, భువనేశ్వర్‌ 2, హార్దిక్‌ పాండ్యా, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు.

  అంతకుముందు తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణత 20 ఓవర్లో 2 వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు ఆ తప్పు ఎందుకు చేసామో తెలిసేలా చేశారు భారత్ బ్యాట్స్‌మెన్స్. ఆశ్చర్యంగా భారత్ ఇన్నింగ్స్‌‌ను విరాట్ కోహ్లి,రోహిత్ శర్మ అరంభించారు. 5 ఓవర్లకు భారత్‌ 44/0 పరుగులు సాధించింది.

  రోహిత్ ఎప్పటిలాగే దాటి ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్‌ (53; 30 బంతుల్లో) హఫ్ సెంచరీతో ఆదరగొట్టాడు. భారీ సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివరకు రోహిత్‌ శర్మ (64; 34 బంతుల్లో 4×4, 5×6)పరుగులు చేసి స్ట్రోక్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత సూర్యకుమార్.. విరాట్ కోహ్లితో జత కట్టి ఇంగ్లీష్ బౌలర్లను అదే రీతిగా ఎదుర్కొన్నాడు. సూర్య కూమర్ నాల్గో టీ 20లా చేలరేగి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి 32(17) పరుగులు చేసిఅబ్ధుల్ రషిద్ బౌలింగ్‌లో రాయ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లి(80),హార్ధిక్ పాండ్స్ (39)తో ముందుకు కొనసాగించారు.
  Published by:Rekulapally Saichand
  First published: