Home /News /sports /

INDIA ATHLETE VINOD KUMAR WINS BRONZE IN PARALYMPICS 2020 DISCUS THROW JNK

Paralympics: డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ వినోద్ కుమార్‌కు కాంస్య పతకం

భారత అథ్లెట్ వినోద్ కుమార్‌కు పారాలింపిక్స్‌లో కాంస్యం (PC: Twitter/ANI)

భారత అథ్లెట్ వినోద్ కుమార్‌కు పారాలింపిక్స్‌లో కాంస్యం (PC: Twitter/ANI)

భారత పారా అథ్లెట్‌లు ఆదివారం మూడు పతకాలు సాధించి సూపర్ సండేగా మార్చేశారు. టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ప్రదర్శనను అందరూ అభినందిస్తున్నారు.

    టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో (Paralympics) భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే టేబుల్ టెన్నిస్‌ (Table Tennis), హైజంప్‌లో (High Jump) భారత పారా అథ్లెట్లు రెండు రజత పతకాలు సాధించారు. ఇక ఇప్పుడు వినోద్ కుమార్ (Vinod Kumar ) డిస్కస్ త్రోలో (Discus throw) కాంస్య పతకం (Bronze Medal) సాధించాడు. దీంతో ఓకే రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. 41 ఏళ్ల వినోద్ ఎఫ్52 డిస్కస్ త్రోలో వినోద్ 19.91 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. వినోద్ కాంస్య పతకం సాధించడమే కాకుండా ఆసియాలోనే అత్యుత్తమ దూరం విసిరిన అథ్లెట్‌గా వినోద్ గుర్తింపు సాధించాడు. పోలాండ్‌కు చెందిన పీయోటర్ కోసెవిక్జ్ 20.02 మీటర్ల దూరం విసిరి సర్వర్ణం సాధించగా.. క్రొయేషియాకు చెందిన వెలిమిర్ సాండర్ 19.98 మీటర్ల దూరం విసిరి రజతం దక్కించుకున్నాడు. ఆదివారం భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్యం దక్కింద. మహిళల టేబుల్ టెన్నిస్‌లో భవానీ పటేల్ రజత పతకం, హైజంప్ టీ47 పోటీల్లో పారా అథ్లెట్ నిషాద్ కుమార్ రజత పతకం సాధించగా.. వినోద్ కుమార్ డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించాడు.

    వినోద్ కుమార్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో ఉద్యోగం రావడంతో ట్రైనింగ్ కోసం వెళ్లాడు. కాగా, శిక్షణలో భాగంగా ఒక కొండ ఎక్కుతూ కింద పడిపోయాడు. దాంతో అతని రెండు కాళ్లకు గాయాలై చచ్చుబడి పోయాయి. దాదాపు 10 ఏళ్ల పాటు వినోద్ కుమార్ మంచానికే పరిమితం అయ్యాడు. వినోద్ మంచానికి పరిమితం అయిన సమయంలోనే తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. వినోద్ తండ్రి భారత ఆర్మీలో పని చేశారు. 1971 భారత్-పాక్ యుద్దంలో వినోద్ తండ్రి సేవలు అందించారు. ఆ క్రమంలోనే బీఎస్ఎఫ్‌కు వెళ్లడానికి వినోద్ నిర్ణయించుకున్నాడు. కానీ వినోద్ శిక్షణ సమయంలో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. పదేళ్ల తర్వాత కాస్త కూర్చో గలిగిన వినోద్.. డిస్కస్ త్రోలో శిక్షణ తీసుకున్నాడు. అలా పారాలింపిక్స్‌కు వెళ్లి ఉత్తమ ప్రదర్శన చేసి కాంస్యం సాధించాడు.

    (PC: Paralympics)








    వినోద్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు మంత్రులు ఆయనను అభినందించారు. భారత అథ్లెట్లుకు ఇది సూపర్ సండేగా మారిపోయింది. జాతీయ క్రీడా దినోత్సవం రోజే భారత జట్టు మూడు పతకాలు సాధించడం గర్వించదగిన విషయం అని అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Olympics, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు