HOME »NEWS »SPORTS »india and england have a very good chance of making it to the final says team india crickter yuvraj singh bs

Cricket World Cup 2019: ఫైనల్‌కు వెళ్లే జట్లు ఇవేనంటున్న యువరాజ్‌సింగ్

Cricket World Cup 2019: ఫైనల్‌కు వెళ్లే జట్లు ఇవేనంటున్న యువరాజ్‌సింగ్
యువరాజ్ సింగ్ (BCCI / twitter )

Cricket World Cup 2019: భారత్ వరల్డ్ కప్ గెలవడంలో హార్దిక్ పాండ్యా కీలకం అవుతాడని యువీ తెలిపాడు. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదొక చక్కటి టోర్నమెంట్. అయితే, ఎక్స్-ఫ్యాక్టర్ విషయానికి వస్తే మాత్రం హార్దిక్ పాండ్యానే. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో పాటు బంతితో రాణిస్తున్నాడు’ అని వెల్లడించాడు.

  • Share this:
    ఐసీసీ క్రికెట్ టోర్నీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో ఈ భారీ టోర్నీ ప్రారంభం కాబోతోంది. అన్ని జట్లు తమ సామర్థ్యానికి తగ్గట్లు పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి వరల్డ్ కప్‌లో రెండు విశేషాలు చోటుచేసుకోబోతున్నాయి. అందులో ఒకటి క్రికెట్ పుట్టిన గడ్డపై టోర్నీ జరుగుతుండగా, మరోటి.. రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతుండటం. అన్నింటికంటే ఎవరు ఫైనల్ చేరతారు? ఎవరు కప్పు ఎగరేసుకుపోతారు? అన్నదాని గురించే ప్రతీ ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ చేరే రెండు జట్ల పేర్లు చెప్పేశాడు ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. 2011 వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన యువీ.. కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఇంగ్లండ్, ఇండియాకే ఉన్నాయని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా కూడా మంచి ఫామ్‌లో ఉందని, ఆ జట్టుకు కూడా ఫైనల్ అవకాశాలు ఉన్నాయని వెల్లడించాడు.

    ఇక, భారత్ వరల్డ్ కప్ గెలవడంలో హార్దిక్ పాండ్యా కీలకం అవుతాడని యువీ తెలిపాడు. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదొక చక్కటి టోర్నమెంట్. అయితే, ఎక్స్-ఫ్యాక్టర్ విషయానికి వస్తే మాత్రం హార్దిక్ పాండ్యానే. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో పాటు బంతితో రాణిస్తున్నాడు’ అని వెల్లడించాడు. ఇంగ్లండ్‌ పిచ్‌లపై ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే, పాండ్యా మూడో పేస్ బౌలర్‌గా పనికొస్తాడని, ఈ కాంబినేషన్‌ జట్టులో సమతుల్యాన్ని తీసుకు వస్తుందని వివరించాడు. గతంలో టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఇదే ఫార్ములాతో బరిలోకి దిగిందని పేర్కొన్నాడు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:May 27, 2019, 16:08 IST

    टॉप स्टोरीज