పేటీఎం (PayTm) టెస్ట్ సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు (Team India) రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలి రోజు 258/4 ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాను కివీస్ పేసర్ టిమ్ సౌథీ (Tim Southee) బెంబేలెత్తించాడు. భారత జట్టు కేవలం 8 పరుగులు జోడించి వికెట్ కోల్పోయింది. తొలి రోజు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా (Ravindra Jadeja) (50) తన వ్యక్తిగత స్కోరుకు పరుగులేమీ జోడించకుండానే టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వృద్దిమాన్ సాహ (1) పూర్తిగా నిరాశ పరిచాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో కీపర్ టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి సాహ వెనుదిగాడు. అయితే మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన బ్యాటింగ్ కొనసాగించాడు. స్వింగ్ అవుతున్న బంతులను కూడా చక్కగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
డ్రింక్స్ విరామం సమయానికి భారత జట్టు 305/6 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్ ఉండటంతో పాటు అశ్విన్ కూడా దూకుడుగా ఆడుతూ కనిపించాడు. అయితే డ్రింక్స్ తర్వాత తొలి బంతికే శ్రేయస్ అయ్యర్ (105) టిమ్ సౌథీ బౌలింగ్‌లో యంగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే అక్షర్ పటేల్ (3) టిమ్ సౌథీ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో లంచ్ విరామ సమయానికి భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
Innings Break!
That will be the end of #TeamIndia's innings with 345 on the board in the first innings.
Scorecard - https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/GeJ7A3iGRQ
— BCCI (@BCCI) November 26, 2021
అయితే బ్రేక తర్వాత మిగిలిన రెండు వికెట్లు త్వరగానే పడిపోయాయి. క్రీజులో కుదురుకొని ధాటిగా ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ (38) అజాజ్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇషాంత్ శర్మ (0) అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుటవడంతో భారత జట్టు 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి రోజు స్కోర్‌కు 86 పరుగులు మాత్రమే జోడించగలిగింది. ఉమేష్ యాదవ్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లను టిమ్ సౌథీ 5, కైల్ జేమిసన్ 3, అజాజ్ పటేల్ 2 వికెట్లు తీశారు.
ఇక శ్రేయస్ అయ్యర్ తొలి టెస్టులోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. తొలి రోజు ముగిసే సరికి శ్రేయస్ అయ్యర్ 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన తర్వాత రెండో రోజు ఆటలో తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ 91.1 బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 16వ ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రేయస్ అయ్యర్ 156 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇందులో 13 ఫోర్లు 2 సిక్సులు ఉన్నాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs newzealand, Shreyas Iyer, Team India, Test Cricket